గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
బహుళ అంతస్తుల భవన నిర్మాణదారులు వారి నిర్మాణాలను నగర పాలక సంస్థ నుండి అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం మాత్రమె నిర్మాణాలు చేపట్టాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ నగరంలోని కృష్ణబాబు కాలని, జే.కే.సి కాలేజీ రోడ్డు, పలకలూరు రోడ్డు, నెహ్రు నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి ఆక్యుపెన్సి సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాలను పరిశీలించి, సెట్ బ్యాక్, రోడ్డు ల కొలతలు తనిఖీ చేసి, నిబంధనల ప్రకారం ఉన్న నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పాలక సంస్థ నుండి అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం మాత్రమె భావన నిర్మాణాలు చేపట్టాలని, నిబందనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపడితే అటువంటి నిర్మాణాల పై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబందనల మేరకు మాత్రమే నగరంలో బహుళ అంతస్తు భవనాలు నిర్మాణాలు జరగాలని, భవనాలు నిర్మాణ దశలోనే వార్డ్ సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు నిర్మాణాలను నిరంతరం పరిశీలిస్తూ, నిబందనల మేరకు నిర్మాణాలు చేపట్టకుంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి, నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. భవన నిర్మాణదారులు నిర్మాణాలకు సంబంధించిన నిర్మాణ సామగ్రి రోడ్ల పై వేయకుండా చూడాలని, అలాగే సి అండ్ డి వేస్ట్ ఉంటె వెంటనే తొలగించాలన్నారు. అలాగే నగరంలో పోస్టర్లు బ్యానర్లు ఉంటె వెంటనే తొలగించి, మళ్ళీ వాటిని ఏర్పాటు చేయకుండా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నెహ్రు నగర్ 6వ లైన్ నందు రోడ్డు నిర్మించాలని స్థానిక ప్రజలు కోరగా, సదరు రోడ్డు నిర్మించడానికి అంచనాలు సిద్దం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలగీ మోతిలాల్ నగర్ లో కచ్చా డ్రైన్ ప్లాస్టిక్ వ్యర్దాలతో నిండి మురుగునీరు పారుదల లేకుండుట గమనించి, వెంటనే సదరు డ్రైన్ లో పూడికతీత పనులు చేపట్టి మురుగునీరు పారుదల జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పర్యటనలో సిటీ ప్లానర్ రాంబాబు, ఏసిపీ రెహ్మాన్, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News