Breaking News

కనెక్ట్ ఏపీ లాంటి ఎక్స్పో రాబోయే తరాలకు చాలా అవసరం

-కొత్త కొత్త ఆవిష్కరణలన్ని విజయవాడ కేంద్రంగా చూడడం ఆనందదాయకం
-కనెక్ట్ ఏపీ – ఎక్స్పో కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ తూర్పు నియోజకవర్గం లబ్బీపేట లోని ఎస్ ఎస్ కన్వెన్షన్ నందు కనెక్ట్ ఏపీ ఎక్స్పో కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు

ఈ సందర్భంగా చిన్ని మాట్లాడుతూ బండారు కృష్ణ ఆధ్వర్యంలో కనెక్ట్ ఏపీ లాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని విజయవాడకు తీసుకురావడం శుభ పరిణామమని ఎంపీ చిన్ని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కేబుల్ ఆపరేటర్లు ఓటిపి డిటిపి ఇంటర్నెట్ డ్రోన్ తో పాటు పలు హార్డ్వేర్ సంస్థలన్నిటిని ఒకే చోట వేదికగా మలచడం గొప్ప అవకాశం గా చిన్ని అభివర్ణించారు రాబోయే భవిష్యత్ తరాలన్నీ కొత్త కొత్త టెక్నాలజీస్ పైనే ఆధారపడి ఉందని ఎంపీ అన్నారు మన కేబుల్స్ అదేవిధంగా టెక్నాలజీస్ అన్ని అప్గ్రేడ్ అవుతున్న తరుణంలో వాటన్నిటినీ ఇక్కడ డిస్ప్లే చేయడం వాటి గురించి అనేక విషయాలు తెలుసుకోవడం మంచి అవకాశం అని పేర్కొన్నారు

ఇవాళ ఉన్న ఇంటర్నెట్ స్పీడ్ యుగంలో కొత్త టెక్నాలజీ ద్వారా కేబుల్ ఆపరేటర్స్ కూడా అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇలాంటి ఎక్స్పో ద్వారా ప్రజలకు అవగాహన పెంపొందించడంతోపాటు అమరావతిలో భాగమైన విజయవాడ ప్రాంతంలో ఇలాంటి మరిన్ని ఎక్స్పోలు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ టెక్నాలజీ తెలుసుకున్న ప్రతి ఒక్కరికి నూతన ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంది చిన్ని తెలిపారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన టీం అందరిని ఎంపి అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కనెక్ట్ ఏపీ ఎక్స్పో కార్యక్రమ ప్రతినిధులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *