-గోవధ ను స్వచ్ఛందంగా నిషేధించిన కసాయిలకు అల్తాఫ్ బాబా బహుమతి
కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
గోవధ నిషేధానికి స్వచ్ఛందంగా సహకరిస్తే కసాయిలకు షాబుఖారి ఆస్థాన తరపున భృతి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా. ఇబ్రహీంపట్నంలో పోలీస్ స్టేషన్ లో జరిగిన సమావేశంలో ఆయన సీఐ సుబ్రహ్మణ్యంకు తెలిపారు. దీనిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం మత పెద్దలు, ముస్లిం సంఘాలు మతసామరస్యం కాపాడుకునే విధంగా కసాయిలను ఆదుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎక్కడ కూడా అవాంఛనీయు సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు వ్యక్తిగత బాధ్యత వహించాలని, బక్రీద్ పండగ త్యాగానికి ప్రతిక … మన త్యాగం దేశం చెప్పుకునేలా ఉండాలని తెలిపారు.
Prajavartha Online Telugu News