Breaking News

గుంటూరులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల ప్రజా సంఘాల సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు మినీ అంబేద్కర్ హాల్ నందు ఈరోజు బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల ప్రజా సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశమునకు బీసీ మహాజన సభ రాష్ట్ర అధ్యక్షులు ఉగ్గం సాంబశివరావు అధ్యక్షత వహించారు, బహుజనులు వారి హక్కుల సాధనకై, సమైక్యమై చైతన్యవంతమై పోరాటం చేయాలన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ ప్రసంగిస్తూ, బీసీలకు చట్టసభల్లో అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ మహాజనసభ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పివి రమణయ్య మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం బిసిల కు సమస్త జీవన రంగాల్లో సమానమైన వాటాలు ప్రాధాన్యతలు ప్రభుత్వాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో బీసీలకు, ముస్లింలకు 60% రిజర్వేషన్లు సమగ్ర కుల గణన స్థానిక సంస్థలు జనాభా ప్రాతిపదికన బీసీలకు 52% కల్పించి ఏ, బి, సి, డిలుగా వర్గీకరణ స్థానిక సంస్థల్లో జనాభా ప్రాతిపదికన బీసీలకు 52% రిజర్వేషన్లు కల్పించి ఏ, బి, సి, డిలుగా వర్గీకరణ బీసీలకు రక్షణ చట్టం చట్టసభల్లో రిజర్వేషన్లు బీసీ మహిళకు సబ్ కోట బహుజనులకు రాజ్యాధికారం కల్పించాలని సమావేశం తీర్మానించింది. జూన్ మూడవ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ద్రవిడ ఉద్యమ నేత ఎం కరుణానిధి 13వ జయంతిని పెద్ద ఎత్తున జరపాలని, బహుజన మాట-పాట సాంస్కృతిక చైతన్య కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈ సమావేశంలో వరగాని ఏడుకొండలు, ఆలిండియా బహు జన్ సమాజ్ పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షులు పొనుగుపాటి శ్రీనివాస్‌, శ్రీదేవి, తాడికొండ నరసింహారావు, ఎంఎస్ రెహమాన్, గండు వెంకటేశ్వర్లు, ఓర్సు ప్రేమ రాజు, కే జయసుధ, వి సి కె పార్టీ చిరుతన గంటల వాసు, అశ్విని, వెంకటేశ్వర్లు, జి వెంకటేశ్వర్లు, బత్తుల వీరాస్వామి, సాదు, మాల్యాద్రి, కె దేవప్రసాదరావు, ఎం బాల, తాత, ఎండి జానీ, ఆర్ సురేష్, మేడపి వెంకట ప్రసాద్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *