అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
లేపాక్షి షోరూమ్‌ల్లో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించినందుకు ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ పిఎసి సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ హార్షితిరేకాలు తెలిపారు. ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ బోర్డు ఆమోదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లేపాక్షి షోరూమ్‌ల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పలు సమస్యలతో కూడిన వినతి పత్రాల ద్వారా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి సవితకు తెలియజేశామని వెంటనే స్పందించి మూల వేతనంపై 10 శాతానికి పైగా పెంపు హర్షణీయమన్నారు. గడిచిన రెండేళ్ల నుంచి అమ్మకాలు పెంచినట్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చామన్నారు. పెరిగిన అమ్మకాలను దృష్టిలో పెట్టుకుని ఆయా ఉద్యోగుల స్థాయిని బట్టి 10 శాతానికి పైగా జీతాలు పెరగడటం అభినందనీయమన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 19 లేపాక్షి షోరూమ్‌లు ఉన్నాయని, తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, నెల్లూరు ప్రాంతాలలో షోరూమ్‌లు ఏర్పాటుకు సందర్శించామన్నారు. ప్రతి జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో లేపాక్షి షోరూమ్ ఏర్పాటు చేసే ఆలోచనలో వున్నట్లు తెలిపారు. కడప, అనంతపురం, కర్నూలులో మా షోరూమ్‌లున్నాయి. ఢిల్లీ, కోల్‌కత్తా, హైదరాబాద్ మినహా మిగిలిన 16 షోరూమ్‌లూ ఏపీలోనే ఉన్నాయన్నారు. ఢిల్లీ, కాకినాడలలో మా షోరూమ్‌లు నేటితరం అభిరుచులకు అనుగుణంగా మరమ్మతులుచేసి పునరుద్ధరణలో వున్నాయని త్వరలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించే ఆలోచనలో వున్నట్లు తెలిపారు. ఈ కామర్స్ ద్వారా చేనేత వస్త్రాల డోర్ డెలివరీ మాదిరిగా వినియోగదారుల చెంతకే హస్త కళారూపాలు అందజేయాలన్న సదుద్దేశంతో వాట్పాప్ ద్వారా కళాక్షి పేరుతో సమాచారమందించనున్నారు. 8 కోట్ల నుండి 20 కోట్ల పెంచేవిధంగా అమ్మకాలు జరిగేలా ప్రతి ఉద్యోగి సహకరించాలన్నారు. హస్త కళాకారులకు ఆర్థిక భరోసా కలిగించేలా 365 రోజులూ ఉపాధి కల్పించాలన్నది సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ లక్ష్య సాధనకు బద్ధులై… లేపాక్షి షోరూమ్‌ల్లో అమ్మకాలు పెంచే బాధ్యత ఉద్యోగులదేనన్నారు. హస్త కళాకారులతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. పెరిగిన అమ్మకాల నేపథ్యంలో జీతాలు పెంచినట్లు వెల్లడించారు. ఒకవైపు నేటితరం అభిరుచులను దృష్టిలో పెట్టుకుని ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తూ, లేపాక్షి షోరూమ్‌లకు నూతన హంగులు కల్పిస్తున్నామన్నారు. జీతాల పెంపుదలపై ఉద్యోగులు హర్షం వ్యక్తంచేశారన్నారు.
Prajavartha Online Telugu News