Breaking News

20 వేల క్యూసెక్కుల సామర్ద్యంతో ఎనికేపాడు యూటీ.

-ఎనికేపాడు నుండి కొల్లేరు వరకు బుడమేరు డ్రైన్ పూడికతీత.
-1.80 కోట్లతో వెలగలేరు రెగ్యులేటర్ కు కొత్త గేట్లు అమర్చాం.
-బుడమేరు డ్రైన్ పై ఎనికేపాడు యూటీ పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల

ఎనికేపాడు, నేటి పత్రిక ప్రజావార్త :
బుడమేరు డ్రైన్ పై ఎనికేపాడు దగ్గర యూటి సామర్ద్యాన్ని 4 వేల క్యూసెక్కుల నుండి 20 వేల క్యూసెక్కులకు పెంచుతూ, 36.1 కోట్లతో నిర్మాణ పనులను చేపట్టామని తెలిపారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ ఎనికేపాడు దగ్గర జరుగుతున్న అండర్ టన్నెల్ నిర్మాణ పనులను అధికారులతో కలసి క్షేత్ర స్దాయిలో పనులను పరిశీలించారు మంత్రి నిమ్మల రామానాయుడు. బుడమేరు వరద ముంపు నుండి విజయవాడ నగరాన్ని కాపాడేలా ఎనికేపాడు యూటీ సామర్ద్యాన్ని 20వేల క్యూసెక్కులకు పెంచుతున్నాం అని అన్నారు.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుగా వెలగలేరు రెగ్యులేటర్ కు సంబందించిన గేట్లను ఎప్పటికప్పుడు నియంత్రించేలా 1.80 కోట్ల రూపాయలతో కొత్తగేట్లు అమర్చడం జరిగిందని స్పష్టం చేశారు. అదేవిధంగా నాడు బుడమేరు గట్టుకు పడిన 3 గండ్లను పూడ్చంతో పాటు, సిసి వాల్ నిర్మాణం కూడా పూర్తి చేశామని చెప్పారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా, 120 కోట్లతో 8.2 కి. మీ లైనింగ్ ప్రారంభించాం అని, డైవర్షన్ ఛానల్ మిగిలిన 2 కి. మీ లైనింగ్, 115 కోట్లతో థర్మల్ ప్లాంట్ పనులు టెండర్ దశ లో ఉన్నాయని అన్నారు. గత టిడిపి హాయాంలో చేపట్టిన ఎనికేపాడు యూటీ నుండి కొల్లేరు వరకు వెళ్ళే ఛానల్ విస్తరణ పనులను వైసిపి ప్రభుత్వం రద్దు చేసింది అని, దీంతో కూటమి ప్రభుత్వం ఎనికేపాడు నుండి కొల్లేరు వరకు 57 కి.మీ పొడవున బుడమేరు డ్రైన్ పూడికతీత పనులు చేపట్టిందని తెలిపారు. కొల్లేరు నుండి ఉప్పుటేరు మీదుగా బుడమేరు డ్రైన్ నీరు సముద్రంలోకి పోయేలా 9 కోట్లతో డ్రెడ్జింగ్ పనులు సైతం జరుగుతున్నాయి అని మంత్రి నిమ్మల వివరించారు. ఈ పర్యటనలో మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, కెడిసి సిఈ రాంబాబు, మరియు ఇతర ఇరిగేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *