-మహానాడు మొదటి రోజే ఎంపీ చిన్ని సుడిగాలి పర్యటన
-నాలుగు నియోజకవర్గాల్లో 11చోట్ల వర్చువల్ మహానాడు లో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని
-విజయవాడ పార్లమెంట్లో వర్చువల్ మహానాడుకు క్యాడర్ నుండి అనూహ్య స్పందన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పార్లమెంట్ పరిధిలో తొలిరోజు మహానాడు కార్యక్రమం కార్యకర్తల కోలాహలంతో గ్రాండ్ సక్సెస్ గా ముగిసింది తొలిరోజు మహానాడులో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని సుడిగాలి పర్యటన చేపట్టారు ఏకంగా ఒక్కరోజే నాలుగు నియోజకవర్గాల్లో లోని 11 చోట్ల వర్చువల్ మహానాడులో ఆయన పాల్గొని కార్యకర్తల్లో జోష్ నింపారు విజయవాడ తూర్పు , సెంట్రల్, పశ్చిమ, మైలవరం నియోజకవర్గం ఎంపీ చిన్ని పర్యటించారు ఈ కార్యక్రమాలలో తూర్పు నియోజకవర్గం నుండి టిడిపి సీనియర్ నాయకులు బొప్పన భవ కుమార్ సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమ మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి నియోజకవర్గాల్లో జరిగిన మహానాడులో పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ తెలుగుజాతి గర్వించదగ్గ వ్యక్తి తెలుగు వారు ఎక్కడున్నా చిరాస్మరణీయమైనటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు అని అన్నారు. నందమూరి తారక రామారావు ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు .ఇప్పటివరకు జరిగిన మహానాడులు అన్నిటిలోనూ ఈ మహానాడు చాలా ప్రత్యేకమైనదని ప్రతి నియోజకవర్గం లో ఉన్న క్లస్టర్ పరిధిలో మహానాడు జరగడం కార్యకర్తలు అందరూ అక్కడికి వచ్చి మహానాడు ను జయప్రదం చేయడం చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు.ముఖ్యంగా స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే పెంచిందని గుర్తు చేశారు.
మహానాడు తెలుగువారి అందరి పండుగ అని భారత దేశంలోనీ అన్ని ప్రాంతీయ పార్టీలన్నింటిలో నెంబర్ వన్ గా నిలబడింది కేవలం తెలుగుదేశం పార్టీ అని చిన్ని తెలిపారు.కార్యకర్తల వల్లే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ స్థాయిలో ఉందని కోటి సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు.రాబోయే రోజుల్లో కార్యకర్తే అధినేతగా కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు లోకేష్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.పార్టీ ఈ రెండు రోజులు ప్రవేశపెట్టే తీర్మానాలన్నిటిని ప్రభుత్వం ద్వారా త్వరలోనే అమలు చేయనున్నట్లు తెలియజేశారు .మహానాడు అంటే పసుపు సైనికుల పండుగ కార్యక్రమం అని కార్యకర్తల భుజాలపైన వేసుకుని చేసే పండుగ మహానాడు మాత్రమేనని స్పష్టం చేశారు.ఎలాంటి పరిస్థితులైన కార్యకర్తల అండతోనే ఎన్ని ఒడిదుడుకులు ఉన్న తట్టుకుని తెలుగుదేశం పార్టీ నిలబడిందని చిన్ని గుర్తు చేశారు .లోకేష్ నాయకత్వంలో పార్టీ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండబోతుందని ఇప్పటికే పొలిట్ బ్యూరోలోనూ రాష్ట్ర కార్యవర్గంలోనూ కమిటీలు అన్నిటిలోనూ లోకేష్ మార్క్ చాలా స్పష్టంగా కనిపిస్తుందని చిన్ని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటివి లీడర్ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంతో నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు
ముఖ్యంగా విజయవాడ మూడు నియోజకవర్గాల్లో పర్యటించిన సమయంలో ఎంపీ చిన్ని కొండ ప్రాంతం ప్రజానీకానికి మరొకసారి కొండ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ జీవో నెంబర్ 30 ద్వారా కొండ పోరంబోకు ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేద ప్రజలకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ జరుగుతుందని ఇంకా దానికి కేవలం నెలరోజుల సమయం మాత్రమే ఉందని 40,000 మంది పైగా లబ్ధిదారులు ఈ రిజిస్ట్రేషన్ వినియోగించుకోవాలని తెలియజేశారు ఎస్సీ ఎస్టీ మహిళలకు ప్రత్యేకంగా కొన్ని విభాగాల్లో శిక్షణ ఇచ్చి వారిని ఆర్థిక ఎదుగుదలకు సైతం కృషి చేస్తున్నట్లు తెలిపారు ఇదంతా తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి చంద్రబాబు యువనేత లోకేష్ స్ఫూర్తితోనే జరుగుతుందని తెలిపారు
ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం నుండి తూర్పు నియోజకవర్గం పరిశీలకురాలు ముల్పూరి కళ్యాణి టిడిపి సీనియర్ నాయకులు బొప్పన భవ కుమార్ కరిముల్లా రవి పడాల గంగాధర్ సతీష్ చంద్ర రత్నశ్రీ దేవానంద్ సెంట్రల్ నియోజకవర్గం నుండి సెంట్రల్ నియోజకవర్గ పరిశీలకులు బోస్ నెలిబండ్ల బాల పరుచూరి ప్రసాద్ చరణ్ సాయి యాదవ్ పశ్చిమ నియోజకవర్గం నుండి పశ్చిమ నియోజకవర్గం పరిశీలకులు ఈశ్వర్, ఫతావుల్లా గుర్రంకొండ దనేకుల సుబ్బారావు ప్రభుదాస్ వి వి కె నరసింహారావు పిళ్ళా శ్రీనివాస్ తుపాకుల రమణమ్మ బేవర సాయి బడుగు వెంకన్న నాగోతు రామారావు లోకేష్ రాంబాబు పేరం సూర్యనారాయణ జహీద్ పెద్ది శ్యామ్ మైలవరం నియోజకవర్గ టిడిపి పరిశీలకురాలు పుష్పవతి మాజీ రాష్ట్ర కార్యదర్శి జంపాల సీతారామయ్య కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు చనుమోలు నారాయణ రావి ఫణి పెదర్ల రవి మహాలక్ష్మి గరికపాటి శివ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News