-కూటమినేతలతో కలిసి వినతులు స్వీకరించిన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ లకు విశేష స్పందన లభిస్తోంది. బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్ లో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలు, వినతులను కూటమి నేతలకు అందజేశారు. నూతన ఇంటి కొరకు దరఖాస్తులు, కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, సామాజిక పెన్షన్లు, తాగునీటి ఇబ్బందులు తదితర అంశాలపై వినతులు అందాయని కూటమినేతల పేర్కొన్నారు. కొన్ని సమస్యలను కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు పీవీ చిన సుబ్బయ్య, గంజి పవన్, ఏలూరు సాయి శరత్, శనివారపు శివ, గన్నవరపు శ్రీనివాసరావు, ఈగల సాంబశివరావు, దాడి మురళి కృష్ణ,నక్కెట్ల రాజా, శ్యామ్ మారేపల్లి, మలపరెడ్డి అప్పారావు, గాడు గణేష్, సీ హెచ్ రామ నాయుడు, గూడూరు కొండయ్య,వీ ఆర్ ఓ నాని కుమార్ పాల్గొని వినతులు స్వీకరించారు.
Prajavartha Online Telugu News