Breaking News

బీసీల అభివృద్ధి.. అభ్యున్నతి తెలుగుదేశం పార్టీతోనే

-ఎన్టీఆర్ రాకతోనే బీసీలకు సామాజిక, రాజకీయ, ఆర్ధిక తోడ్పాటు
-బీసీలకు అసలైన స్వాతంత్ర్యం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదే
-గత ఐదేళ్లు బీసీలను అణచివేయడమే లక్ష్యంగా జగన్ రెడ్డి పాలన సాగింది
-మహానాడు వేదికపై బీసీ సంక్షేమం తీర్మానాన్ని బలపర్చిన మంత్రి కొల్లు రవీంద్ర

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
బడుగు బలహీన వర్గాల ప్రజలకు అసలైన స్వాతంత్ర్యం తెలుగుదేశం పార్టీ ఏర్పాటుతోనే సాధ్యమైందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బీసీ సంక్షేమం తీర్మానాన్ని మహానాడు వేదికపై బలపర్చారు. మంత్రి మాట్లాడుతూ.. మహానాడు రాజకీయ ప్రసంగాల వేదిక కాదు. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే మహోన్నత స్థానం. అప్పటి వరకు బ్యాక్ వార్డ్ క్లాసెస్‌గా పిలుస్తూ అణచివేతకు గురవుతున్న బీసీలను సమాజానికి బ్యాక్ బోన్ క్లాసెస్ అని గుర్తించి, వెన్నుతట్టి ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ, అన్న నందమూరి తారక రామారావు గారేనన్నారు.

నాడు సమాజాన్ని వేధిస్తున్న కరణం, మున్సబు, పటేల్ పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి బాంచన్ దొర అనే సంప్రదాయాన్ని రద్దు చేసి బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 20శాతం రిజర్వేషన్లు కల్పించి సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులగా అవకాశాలిచ్చారు. అయ్యన్న పాత్రుడు, యనమల రామకృష్ణుడు, కింజరాపు ఎర్రన్నాయుడు, కె.ఇ.కృష్ణ మూర్తి లాంటి తొలితరం బీసీ నాయకత్వాన్ని తయారు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ దాదాపు 8 మంది బీసీలకు మంత్రి పదవులిచ్చారు. అత్యంత కీలకమైన వ్యవసాయం, మైన్స్, ఎక్సైజ్, రెవెన్యూ, వైద్యారోగ్యం, గృహ నిర్మాణం, కార్మిక సంక్షేమం, ఎంఎస్ఎంఈ శాఖలను కింజరాపు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, వాసంశెట్టి శుభాష్, సవిత, కొండపల్లి శ్రీనివాస్ లాంటి మలితరం బీసీ నాయకులకిచ్చారు. తెలుగుదేశం పార్టీలో అత్యున్నత పొలిట్ బ్యూరోలో 8 మందికి, పార్లమెంటు అధ్యక్షులుగా పది మందికి అవకాశం కల్పించారు.

బీసీల బతుకులు మారాలంటే చదువు చేరువ చేయాలని భావించిన చంద్రబాబు నాయుడు గారు రెసిడెన్షియల్ స్కూల్స్, స్టడీ సర్కిల్స్, విద్యోన్నతి, విదేశీ విద్య లాంటి పథకాలు అమలు చేశారు. స్వయం ఉపాధి రుణాలు అందించి ఆర్ధికంగా ఎదిగేలా తోడ్పాటు అందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 20 శాతం రిజర్వేషన్లను 34 శాతానికి పెంచారు. చరిత్రలో తొలిసారిగా బీసీ సబ్ ప్లాన్ తీసుకొచ్చారు. నామినేటెడ్ పదవుల్లోనూ ప్రాధాన్యమిస్తూ.. టీటీడీ, ఏపీఐఐసీ లాంటి ప్రఖ్యాత సంస్థలకు ఛైర్మన్లుగా బీసీలను నియమించారు.
మాయమాటలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి.. బీసీలపై అరాచకమే తన జీవిత లక్ష్యం అన్నట్లుగా వ్యవహరించారు. జింకా వెంకట నరసయ్య అనే బీసీ నేతను హత్య చేసి, అతని ఆస్తుల్ని కబ్జా చేయడంతో జగన్ రెడ్డి కుటుంబ ప్రస్థానం ప్రారంభమైంది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అదే వైఖరి అనుసరించారు. బీసీలపై కక్ష గట్టి రిజర్వేషన్లను 34 శాతం నుండి 24 శాతానికి తగ్గించారు. ప్రశ్నిస్తే కేసులు.. ఎదురిస్తే దాడులు, నిలదీస్తే నరికివేతలు అనేంతలా కిరాతకానికి పాల్పడ్డారు. తోట చంద్రయ్యను నడిరోడ్డుపై పీక కోసి చంపారు. అమర్నాథ్ గౌడ్‌పై పెట్రోల్ పోసి తగులబెట్టారు. బీసీ నాయకత్వాన్ని అణచివేసే లక్ష్యంతో.. అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు లాంటి సీనియర్లపై తప్పుడు కేసులు పెట్టారు. నాపై తప్పుడు కేసు పెట్టి 54 రోజులు జైల్లో పెట్టారు.

యువగళం పాదయాత్ర బీసీల్లో భరోసా నింపింది. బీసీ రక్షణ చట్టం అమలు చేస్తామని ప్రకటనతో బీసీలకు ధైర్యం వచ్చింది. ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే బీసీ రక్షణ చట్టానికి ప్రాణం పోశారు. నామినేటెడ్ పదవుల్లో 34 శాతం బీసీలకు కేటాయించారు. కల్లుగీత కార్మికులకు మద్యం షాపులు, బార్లలో 10 శాతం కేటాయించారు. వడ్డెర్లకు క్వారీల్లో 15 శాతం కేటాయించి సీనరేజిలో 50 శాతం సబ్సిడీ ప్రకటించారు. జగన్ రెడ్డి రద్దు చేసిన ఆదరణ పథకాన్ని రూ.1000 కోట్లతో ప్రారంభించాం. నాయీ బ్రాహ్మణులకు, నాయీ బ్రాహ్మణులకు 200 యూనిట్లు, చేనేతల మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రకటించారు. జగన్ రెడ్డి కుట్రపూరితంగా తీసుకొచ్చిన జీవో నెం.217 రద్దు చేసి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపారు. వేట నిషేధ భృతిని 1.30 లక్షల కుటుంబాలకు అందిస్తున్నారు. తమిళనాడు నుండి వచ్చే బూట్ల సమస్యను దగ్గరుండి పరిష్కరించడమే కాకుండా.. రూ.220 కోట్లతో 200 మెకనైజ్డ్ బోట్స్ కొనుగోలు చేసి అందిస్తామని హామీ ఇచ్చారు. సొసైటీల ద్వారా బీసీ వర్గాలకు స్వయం ఉపాధి రుణాలు అందించేందుకు సన్నాహాలు చేపట్టారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో బీసీ యువతకు అవకాశాలు కల్పిస్తున్నారు. అనునిత్యం బీసీలకు అండగా నిలుస్తూ.. బీసీలను భుజానికెత్తుకుని కాపాడుకునే పార్టీ కార్యకర్తగా ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *