Breaking News

జాబ్ మేళ పోస్టర్ ను విడుదల చేసిన నగర కమిషనర్ కె. మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటు వంటి నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి చేస్తున్నది. దీనిలో భాగముగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ మేళాలు నిర్వహించి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్ద సహకారంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గౌరవ శాసన సభ్యులు ఎమ్మెల్యే శ్రీ గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీన హిందూ ఫార్మసీ కళాశాల అమరావతి రోడ్, నగరాలు, వేళంగిణి నగర్, గుంటూరు నందు జరగబోవు ఉద్యోగ మేళా పోస్టర్ ను నగర కమిషనర్ కే. మయూరు అశోక్ IAS, నగర పాలక సంస్థ లోని తన ఛాంబర్ నందు మెగా జాబ్ మేళ పోస్టర్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి చేస్తున్నది అని తెలియజేశారు. ఈ జాబ్ మేళాకు 30 కంపెనీల పాల్గొంటున్నాయి, మరియు 1100 ఉద్యోగ అవకాశములు ఉన్నాయన్నారు. కావున జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులు ఈ జాబ్ మేళాలో లో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.
గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి శ్రీ కొండా సంజీవరావు గారు మాట్లాడుతూ, ఈ మెగా జాబ్ మేళాలో 10వ తరగతి నుంచి బి.టెక్ వరకు చదువు కొన్న ప్రతి ఒక్కరు ఈ జాబ్ మేళ లో పాల్గొని ఈ గొప్ప అవకాశమును సద్వినియోగం చేసుకొనవలసిందిగా తెలియజేశారు ఈ కార్యకరములో ఇంకుక్స్ ఏఐ ప్రైవేట్ లిమిటెడ్, క్లౌడ్ మెల్లో టెక్నాలజీస్ ఎల్‌ఎల్‌పి, మాల్టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎఫ్ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బుక్ ఎక్స్‌పర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైమారియా హెల్త్ కేర్, వంటి పలు రకాల కంపెనీలు హాజరవుతున్నాయి అని తెలియజేసారు. జీతం వారి విధ్యర్హతను బట్టి సుమారు 9000 – 35,000 రూపాయల వరకు ఉండవచ్చని తెలిపారు
ఈ జాబ్ డ్రైవ్ కు ఎస్.ఎస్.సి, ఇంటర్, ఐ‌టిఐ, డిగ్రీ, బి.టేక్, డిప్లొమా, ఫార్మసి, మరియు పి.జి విభాగముల వరకు చదువుకున్నటు వంటి 18-25 సం||ల వయసు గల నిరుధ్యోగ యువతి యువకులు వారి యొక్క బయోడేటా లేదా రెస్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్, ఆధార్ నకలు మరియు పాస్ పోర్ట్ ఫోటో తో నేరుగా ఇంటర్వ్యూ కు హాజరు కాగలరు.

చిరునామా :
తేదీ : 02-06-2026
సమయం : ఉదయం 09:00 నుండి సాయంత్రం 04:00 వరకు ఇంటర్వూలు జరుగును.
స్థలం : హిందూ ఫార్మసీ కళాశాల అమరావతి రోడ్, నగరాలు, వేళంగిణి నగర్, గుంటూరు.

సంప్రదించవలసిన నంబర్లు :- ఎన్.కృపానందం (9581794605), ఎ.రామకృష్ణ (7731982861) నరేష్ దేవర (9866366187)

ఔత్సాహిక యువతి యువకులు ముందుగా https://naipunyam.ap.gov.in/ అనే వెబ్ సైట్ నందు రిజిస్టర్ చేసుకోగలరు. మరిన్ని వివరములకు కంట్రోల్ నంబర్: 9988853335, 8712655686, 8790118349, 8790117279 మరియు పైన తెలిపిన నంబర్లను సంప్రదించగలరు.

గమనిక: యువతీ యువకులు జాబ్ డ్రైవ్ జరుగు ప్రదేశం నందు స్పార్ట్ రెజిస్ట్రేషన్ సౌకర్యం కలదు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *