Breaking News

ప్రమోషన్ ఛానల్ కు సహకరించాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు జిల్లా అసోసియేషన్ ఆఫ్ సెక్రటేరియట్ ఇంజనీర్స్ సంఘము జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ను బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ మేరకు ప్రమోషన్ ఛానల్ మరియు వన్ డిపార్ట్మెంట్ వన్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ అనే అంశంపై వివరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ కమిటీ నివేదిక కాలయాపన జరగకుండా త్వరగా వచ్చే విధంగా కృషి చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్ స్పందిస్తూ తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్టేట్ జాయింట్ సెక్రెటరీ జె. నాగరాజు, జిల్లా అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *