అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మినిస్ట్రీ అఫ్ హోం అఫైర్స్, భారత ప్రభుత్వము మరియు కమీషనర్, యువజన సర్వీసుల శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము వారి యొక్క సూచనల మేరకు రిపబ్లిక్ డే, 2027 సందర్బముగా ప్రకటించబడు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన “పద్మ అవార్దుల” కొరకు నామినేషన్లు ఎన్.టి.ఆర్ మరియు కృష్ణా జిల్లాల నుండి ఆహ్వానించబడుచున్నవి. సదరు అవార్డులు 1.పద్మ విభూషణ్, 2.పద్మ భూషణ్, 3.పద్మశ్రీ అను మూడు విభాగములుగా ఉండును. ఈ అవార్డులు పొందగోరు వారు దిగువ పేర్కొన్నరంగాలలో విశిష్ట సేవలు అందించి ఉండవలెను.
1) కళలు (Arts )
2) సాహిత్యము మరియు విద్య (Literature & Education)
3) క్రీడలు (Sports)
4) వైద్యం (Medicine)
5) సామాజిక / సాంఘిక సేవ (Social Work)
6) సైన్స్ మరియు ఇంజనీరింగ్ (Science & Engineering)
7) ప్రజా సంబంధాలు (Public Affairs)
8) సివిల్ సర్వీసులు (Civil Services)
9) ట్రేడ్ మరియు ఇండస్ట్రీ ( Trade & Industry)
పైన పేర్కొన్న రంగములో ఉత్తమ సేవ కనబరచిన వారు, వారియొక్క దరఖాస్తును ప్రభుత్వ వెబ్ సైట్ (రాష్ట్రీయ పురస్కార పోర్టల్) https://awards.gov.in నందు తేది.30-05-2026 లోగా నమోదు చేసుకొనవలసినదిగా, ఆన్ లైన్ లో దరఖాస్తు చేసిన అభ్యర్ధులు సదరు పూర్తి వివరములను జిల్లా యువజన సంక్షేమ శాఖ కార్యాలయము నందు ఒక హార్డ్ కాపీని సమర్పించుటతో పాటు, కార్యాలయ మెయిల్ dywokrishna@yahoo.co.in నకు ఒక సాఫ్ట్ ప్రతిని కూడా పంపవలసినదిగా మరియు పద్మ అవార్డుల దరఖాస్తుకు సంబంధించిన అవసరమగు ఇతర వివరముల కొరకు భారత ప్రభుత్వ శాంతి భద్రతల మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ నందు www.padmaawards.gov.in నందు లభ్యమగునని తెలియజేయడమైనది.
కావున, సదరు అవార్డుల కొరకై దరఖాస్తు చేసుకొనగోరు ఎన్.టి.ఆర్ & కృష్ణా జిల్లాలకు చెందిన ఔత్సాహికులు ఈ నెల 30 వ తేది లోగా దరఖాస్తు చేసుకొనవలసినదిగా డాక్టర్ కొల్లేటి రమేష్, ముఖ్య కార్యనిర్వహణాధికారి, జిల్లా యువజన సంక్షేమ శాఖ మరియు స్టెప్, క్రిషి, విజయవాడ వారు ఒక ప్రకటనలో తెలియపరిచారు.
Tags amaravathi
Check Also
36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు
-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …
Prajavartha Online Telugu News