Breaking News

మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి… : జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణాల పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాలను క్షేత్రస్థాయిలో సందర్శించి వివిధ భవనాల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాల అడ్మినిస్ట్రేషన్ విభాగం, తరగతి గదులు, భోజనశాల, మరుగుదొడ్లు, ప్రిన్సిపాల్ బ్లాక్, ల్యాబ్‌లు, లైబ్రరీ, విద్యార్థుల వసతి గృహాలు తదితర నిర్మాణాలను పరిశీలించారు. భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేసి విద్యార్థులకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ నిర్దేశిత సమయానికి పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ప్రభుత్వ వైద్య కళాశాల ఇంచార్జ్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆశాలత తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *