విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో నిరుపేదల వైద్య చికిత్స కొరకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం ల సహాయపడుతుంది అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శుక్రవారం గుణదల తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 22వ డివిజన్ కు చెందిన ఇద్దరికీ వైద్య సేవలు నిమిత్తం దాదాపు 3లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు కాగా ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ తో కలిసి అవినాష్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో సైతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులు అన్నీనిటీని అధిగమించి పేదలకు ప్రతి పధకం అమలు అయ్యేలా పరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఏ పేదవాడు నాణ్యమైన వైద్యానికి దూరం కాకూడదని స్వర్గీయ వైయస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత ఆధునికరించి వెయ్యి రూపాయలు దాటిన ప్రతి వైద్య పరీక్షను ఆ పధకం ద్వారా వర్తించేలా మార్పులు చేసారని, ఏదైనా వైద్య సేవలు ఆ పధకం కిందకు రాకుంటే వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీ కో ఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ జోగారాజు, 22 వ డివిజన్ నాయుకులు పులి రమణారెడ్డి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News