
-నవంబర్ 21న రవాణాశాఖ ఉద్యోగుల జోన్2 ఎన్నికలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్2 అధ్యక్షుడు గా యం రాజుబాబును జిల్లా నుండి ప్రతిపాదన చేస్తున్నట్లు జోన్2 ఎన్నికల జిల్లా ఇంచార్జీ సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక డిటిసి కార్యాలయంలో శుక్రవారంనాడు జిల్లా ఉద్యోగులతో సమావేశంను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ వచ్చే నెల నవంబర్ 21 వ తారీఖున రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్2 ఎన్నికలు నిర్వహించనునట్లు ఆయన తెలిపారు. జిల్లానుండి జోన్2 అధ్యక్షుడిగా ఎం రాజబాబును ఎన్నుకొవటం పట్ల ఉద్యోగులు పూర్తి మద్దతు ఇస్తున్నారని ఉద్యోగులు తరుపున ఆయన తెలిపారు. ప్రస్తుతం కూడా రాజుబాబు జోనల్ అధ్యక్షుడు గా ఉండటం ఆయన నాయకత్వంలో ఎన్నో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకోవడం జరిగిందన్నారు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల విషయాలలో అధికారులతో మాట్లాడి ఉద్యోగులందరికీ న్యాయం జరిగేలా కృషి చేశారని ఉద్యోగులు అన్నారు. అలాగే జిల్లా నుండి జోనల్ కార్యదర్శి గా శ్రీమతి పి విజయను, కోశాధికారి గా కె వి నాగ మురళిని ప్రతిపాదించడం జరిగిందన్నారు. రాజబాబు ,విజయ నాయకత్వంపై పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నాయని మరల జోనల్ అధ్యక్షుడుగా రాజుబాబును కార్యదర్శిగా పి విజయను కొనసాగించాలని ఉద్యోగులే తీర్మానించినట్లు ఆయన చెప్పారు. అధ్యక్షుడిగా రాజబాబునే రెండవసారి కూడా కొనసాగించాలని ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా ఉద్యోగులు తీర్మానించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాజుబాబు మాట్లాడుతూ జోన్2 లోని మూడు జిల్లాల నుండి జోనల్ అధ్యక్షుడుగా నన్ను ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రతిపాదించినందుకు ఉద్యోగులందరికి పెరు పేరున దాన్యవాదములు తెలియజేస్తున్నాం అన్నారు. గత ఎన్నికలలో కూడా మూడు జిల్లాల నుండి ఉద్యోగులు ఏకగ్రీవంగా జోనల్ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం మరల ఇప్పుడు కూడా జోనల్ అధ్యక్షుడు మిరే ఉండాలని కోరుకోవడం చాలా ఆనందంగా ఉందని రాజుబాబు అన్నారు. ఏదైతే నమ్మకంతో మాకు రెండోసారి అవకాశం ఇస్తున్నారో ఆ నమ్మకాన్ని వమ్ముచేయకుండా పూర్తి స్థాయిలో కాపాడుతానని, ఉద్యోగుల పక్షాన నిలుస్తానని, సమస్యల పట్ల పోరాడతానని రాజబాబు తెలిపారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘ నాయకులు పి విజయ, నాగ మురళి, విద్యావతి, రామచంద్రరాజు, చంద్రశేఖర్ శ్రీను, కవిత, భాగ్యరేఖ వెంకట్రావు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News