విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవిని దృష్టిలో ఉంచుకొని, సామాజిక బాధ్యతగా ఎస్ ఎన్ జి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 65 రోజులుగా మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. విఎంసి కార్పొరేషన్ వద్దనున్న ప్రకృతి వనంలో శుక్రవారం 66 వ రోజు నిర్వహించిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ కోసం ఎస్ ఎన్ జి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణానికి మేలు చేకూర్చేలా పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారులు పక్కన, మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటుతూ ప్రత్యేక దృష్టి సారించిన ఎస్ ఎన్ జి ఫౌండేషన్ సభ్యులను ప్రత్తిపాటి శ్రీధర్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఎన్ జి ఫౌండేషన్ చైర్మన్ లయన్ కె శారదవాణి, లయన్ కే వి డి ప్రసాద్, సభ్యులు ఎర్నిని పద్మజ, మల్లికార్జునరావు, కుమారి , విజయలక్ష్మి, షా న్యూస్ ఎడిటర్ హుమాయున్, మల్లికార్జున, వాణి, సంసుద్దిన్, వంశీ, విజయ్, ఆదిత్య, జనసేన నేతలు బొల్లేపల్లి కోటేశ్వరరావు, ఏలూరు సాయి శరత్, సుజనామిత్ర కోఆర్డినేటర్ దొడ్ల రాజా పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News