Breaking News

టెక్స్ టైల్స్ హబ్ గా ఏపీ

-కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్
-నార ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహం
-2030 నాటికి 350 బిలియన్ డాలర్ల టెక్స్ టైల్స్ ఉత్పత్తుల ఎగుమతుల లక్ష్యం
-బ్రాండింగ్ మాస్టర్ చంద్రబాబు
-మోడి, చంద్రబాబు విజనరీ లీడర్లు : కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్
-డబుల్ ఇంజన్ సర్కార్ తో ఏపీలో అభివృద్ధి పరుగులు : మంత్రి సవిత
-గత ప్రభుత్వం రప్పా రప్పా తీసుకొస్తే…
-కూటమి ప్రభుత్వం టెక్స్ టైల్స్, అపెరల్ పాలసీకి శ్రీకారం చుట్టింది
-చేనేత, హస్త కళాకారులకు 365 రోజుల పాటు ఉపాధి కల్పిస్తాం : మంత్రి సవిత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీని టెక్స్ టైల్స్ హబ్ గా అభివృద్ధి చేయనున్నామని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ధి చేయనుందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. 2030 నాటికి 350 బిలియన్ డాలర్ల టెక్స్ టైల్స్ ఉత్పత్తుల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. బ్రాండింగ్ కు మాస్టర్ సీఎం చంద్రబాబు అని, ఆయన నేతృత్వంలో అమరావతి నిర్మాణం తథ్యమని అన్నారు. మోడీ, చంద్రబాబు విజనరీ నాయకులని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రాను నిర్మిస్తామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. కూటమి ప్రభుత్వం నూతన టెక్స్ టైల్స్, అపెరల్ పాలసీ తీసుకొస్తే, గత ప్రభుత్వ పాలకులు రప్పా రప్పా పాలసీ అమలు చేశారంటూ వైసీపీని విమర్శించారు. విజయవాడలో ఓ హోటల్ లో రాష్ట్రంలో చేనేత, జౌళి శాఖ, సెంట్రల్ సిల్క్ బోర్డు అధికారులతో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో చేనేత, హస్త కళల అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. చేనేత, హస్త కళాకారులకు 365 రోజుల పాటు ఉపాధి కల్పిస్తూనే, పర్యావరణ పరిరక్షణకు నార ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహిస్తున్నామని తెలిపారు. అరటి, పైనాపిల్, చెరకు నారలతో ఉత్పత్తుల తయారీకి అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఏపీని టెక్స్ టైల్స్ హబ్ గా అభివృద్ధి చేయాలన్న కూటమి ప్రభుత్వ లక్ష్యానికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. 2030 నాటికి దేశం నుంచి 350 బిలియన్ డాలర్ల టెక్స్ టైల్స్ ఉత్పత్తుల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

బ్రాండింగ్ మాస్టర్ సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు అంటేనే గుర్తుకొచ్చేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. దేశాభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ప్రశంసనీయమన్నారు. ప్రధాని నరేంద్రమోడి, సీఎం చంద్రబాబు విజనరీ నాయకులున్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అమరావతి రాజధాని నిర్మాణం తథ్యమన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటోందన్నారు.

పెట్రోల్ ధరలు మనదేశంలోనే స్వల్పం పెరుగుదల

పశ్చిమాసియా, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇంధన ధరలు అమాంతంగా పెరిగాయని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కంటే ఇండియాలోనే పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయన్నారు. భారత్ లో లీటర్ పై రూ.10లు పెరిగితే, అమెరికాలో 44 శాతం మేర ధరలు పెరిగాయన్నారు. ఫ్రాన్స్, చైనాలోనూ ఇంధన ధరలు భారీ ఎత్తున పెరిగాయన్నారు. భారత్ లో యువత అధికంగా ఉందని, యువ భారత్ అండతో త్వరలోనే విశ్వ గురుగా ఆవిర్భవించనున్నామని కేంద్రమంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు.

కేంద్రం సహకారంతో నార ఉత్పత్తులకు ప్రోత్సాహం : మంత్రి సవిత

డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఏపీలో చేనేత, హస్త కళల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. అరటి, చెరకు, పైనాపిల్ నారలతో ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహం అందివ్వడానికి కేంద్ర జౌళి శాఖ ముందుకొచ్చిందన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒకరిని పారిశ్రామిక వేత్తగా తీర్చిదిద్దే లక్ష్యలో భాగంగా నారా ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యమిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రాను నిర్మిస్తామని మంత్రి సవిత తెలిపారు. గత ప్రభుత్వం రప్పా రప్పా పాలసీని తీసుకొస్తే, తమ ప్రభుత్వం చేనేత, హస్తకళల అభివృద్ధికి టెక్స్ టైల్స్, అపెరల్ పాలసీ తీసుకొచ్చిందన్నారు. అనంతరం కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ను, మంత్రి సవితను చేనేత, జౌళి శాఖ, సెంట్రల్ సిల్క్ బోర్డు అధికారులు ఘనంగా సత్కరించారు. అంతకుముందు హోటల్ లో ఏర్పాటు చేసిన చేనేత, హస్త కళల స్టాళ్లను మంత్రి సవితతో కలిసి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పరిశీలించారు. చేనేత, హస్త కళారూపాల తయారీ, వాటి ప్రాచుర్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ గౌరవ సలహాదారు సుచిత్ర ఎల్లా, ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, కమిషనర్ రేఖారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *