మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు శుక్రవారం ఉదయం కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ న్యూఢిల్లీ నుండి విమానంలో కృష్ణాజిల్లా గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఘన స్వాగతం పలికారు రాష్ట్ర చేనేత జౌళి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఆర్పి శిసోడియా, చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖా రాణి, కృష్ణ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, కేంద్ర సిల్క్ బోర్డ్ సభ్య కార్యదర్శి సిఈఓ పి శివకుమార్, డైరెక్టర్ గిరీష, కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిఐసి జిఎం వెంకటరావు, ఏపీఐఐసీ డిప్యూటీ జోనల్ మేనేజర్ జ్యోతి తదితర అధికారులు అనధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News