Breaking News

20 నెలల్లో వెలిగొండ టన్నెల్స్ లో 5.2 కి.మీ లైనింగ్ పనులు చేశాం.

-టిబిఎం మెషిన్ తొలగించే పనులు చేపట్టాం.
-5నెలల్లో ఫీడర్ కెనాల్ రిటైనింగ్ వాల్ పూర్తి చేశాం.
-సీజన్ మొదలయ్యేనాటికి నల్లమలసాగర్ రిజర్వాయర్ నింపుతాం.
-ఆగష్టులో చంద్రబాబు పోలవరం ఎడమ ప్రధాన కాలువ ప్రారంభిస్తారు.
-పనుల్లో జాప్యం జరిగితే కఠిన చర్యలుంటాయి.
-వెలిగొండ, పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులపై మంత్రి నిమ్మల వీడియో కాన్ఫరెన్స్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలోనే వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో భాగంగా టన్నెల్-2 లో క్లిష్టమైన 5.2 కి.మీ లైనింగ్ పనులు పూర్తి చేశామని అని స్పష్టం చేశారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. శుక్రవారం వెలిగొండ ప్రాజెక్టు, పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి చేయాలని, అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులను ఆదేశించారు.

వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో భాగంగా హెడ్ రెగ్యులేటర్ల రిటైనింగ్ వాల్, వింగ్స్, రిటర్న్స్ పనులు పూర్తయ్యాయని, క్రిష్ణా నదికి వరద వచ్చే నాటికి అప్రోచ్ ఛానెల్ లో ఉన్న లక్షా ఎనభైవేల క్యూబిక్ మీటర్ల మక్ తో పాటు, టన్నెల్-1లో ఉన్న మక్ తొలగింపు పనులు సైతం పూర్తి చేయాలని అందుకు తగ్గట్లు మెషినరీ, మేన్ పవర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. టన్నెల్ -2లో మిగిలి ఉన్న బెంచింగ్ పనులు జూన్ 10కల్లా పూర్తికావాలని, మిగిలిన 1.7 కి.మీ లైనింగ్, జూలై చివరి నాటికి పూర్తి చేయాలని ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. టన్నెల్-2లో చిక్కుకున్న 175 మీటర్ల టిబిఎం మెషిన్ తొలగింపు కోసం ఇటీవలే కోర్టు స్టే ఎత్తేయడంతో, ఈ మిషన్ తొలగింపు పనులు చేపట్టాం అని, రెండు నెలల్లో టిబిఎం మిషన్ తొలగించేలా నిర్దిష్ట ప్రణాళికతో పని చేయాలని సూచించారు.

ఫీడర్ కెనాల్ లో 5.3 కి.మీ రిటైనింగ్ వాల్ పనులు జనవరిలో ప్రారంభించి నేటికి 5 నెలల్లో పూర్తి చేశాం అని తెలిపిన మంత్రి నిమ్మల కెనాల్ లో నత్తనడకన సాగుతున్న 21 కి.మీ లైనింగ్ పనులు వేగవంతం చేయాలని అందుకు తగ్గట్లు మెషినరీ, వాహనాలు సమకూర్చుకోవాలని ఆదేశించారు. తీగలేరు కెనాల్, ఈస్టర్న్ మెయిన్ కెనాల్స్ పనులు తో పాటు పర్మనెంట్ డైవర్షన్ రోడ్డు పనులు సైతం జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేసేలా నిర్దిష్ట ప్రణాళికతో పనులు చేస్తున్నామని అధికారులు మంత్రి నిమ్మలకు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆదేశాల ప్రకారం, ఈ ఏడాది సీజన్ మొదలయ్యే నాటికి నల్లమలసాగర్ రిజర్వాయర్ నింపేలా పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.

పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల్లో భాగంగా నేష‌న‌ల్ హైవేల‌ క్రాసింగ్ దగ్గర జరుగుతున్న వంతెనల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి అని, అనకాపల్లి వరకు గోదావరి జలాలు తరలించేలా ఆగష్టులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించేనాటికి ఎడమ ప్రధాన కాలువలో పెండింగ్ పనులు అన్నీ పూర్తి చేయాలి అని, పనుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను, ఏజెన్సీల ప్రతినిధులను ఆదేశించారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ సమీక్ష సమావేశంలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, వెలిగొండ, పోలవరం ఎడమ ప్రధాన కాలువ ప్రాజెక్టుల సిఈలు, ఎస్ఈలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *