అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ఆధ్వర్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి Community Investment Fund (CIF) కింద రూ. 5068.67 లక్షలు 204 మండల సమాఖ్యలకు మంజూరు చేయబడినాయి. ఈ నిధులు గ్రామీణ మహిళా సంఘాలు, మండల సమాఖ్య లు(MS) మరియు కమ్యూనిటీ ఆధారిత సంస్థల ద్వారా సభ్యుల జీవనోపాధి అభివృద్ధి, ఆదాయ వృద్ధి కార్యక్రమాలకు వినియోగించబడనున్నాయి.
మంజూరైన CIF నిధులను సామాజిక న్యాయం, పారదర్శకత, మరియు లక్ష్య సాధన సూత్రాల ఆధారంగా వినియోగించాలని ఆదేశించారు. మొత్తం నిధుల్లో జనరల్ కేటగిరీకి రూ. 3508.67 లక్షలు, SCలకు రూ. 1170.00 లక్షలు, STలకు రూ. 390.00 లక్షలు కేటాయించటమైనది
మండలాల వారీగా 19 జిల్లాల్లోని 204 మండల సమాఖ్యలకు నిధుల కేటాయింపు జరిగింది. సాధారణంగా ఒక్కో మండల సమాఖ్యకు రూ. 25.00 లక్షల చొప్పున మంజూరు చేయగా, రంపచోడవరం మండల సమాఖ్యకు రూ. 5.68 లక్షలు, రంగంపేట మండల సమాఖ్యకు రూ. 12.99 లక్షలు కేటాయించినట్లు తెలిపింది.
CIF నిధులను మండల సమాఖ్యల నుండి గ్రామ సమాఖ్యలకు, అక్కడి నుండి స్వయం సహాయక సంఘాలకు కేవలం ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకే వినియోగించాల్సి ఉంటుంది. ఒక్కో గ్రామ సమాఖ్యకు గరిష్టంగా రూ. 4.50 లక్షలు, ఒక్కో SHGకు గరిష్టంగా రూ. 1.50 లక్షలు, మరియు ఒక్కో సభ్యురాలికి గరిష్టంగా రూ. 50,000 వరకు మాత్రమే రుణం మంజూరు చేయ వచ్చు.
SC, ST సంఘాలకు తప్పనిసరిగా ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే ఇప్పటివరకు CIF పొందని అర్హతగల సంఘాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. బ్యాంకు రుణాలు, స్త్రీనిధి, ఉన్నతి వంటి పథకాలలో 100% తిరిగి చెల్లింపు ఉన్న సంఘాలకు మాత్రమే అర్హతను పరిశీలించాలని పేర్కొన్నారు.
నిధుల మంజూరు, ప్రపోజల్ తయారీ, మరియు ఆమోద ప్రక్రియను Gram Nidhi portal, CIF MCP, FDM upload విధానాల ద్వారా పూర్తిచేయాలని ఆదేశించారు.
Tags amaravathi
Check Also
36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు
-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …
Prajavartha Online Telugu News