తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా, కేవిబి పురం మండలం, శ్రీనివాసపురం (మారప్ప రెడ్ది ఖండ్రిగ) గ్రామంలో జరుగుతున్న శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ తో కలిసి శుక్రవారం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా గ్రామ ప్రజలు ఎంపీకి, సమన్వయకర్తకి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రత్యేక పూజల్లో పాల్గొని, గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక సంప్రదాయాలు గ్రామీణ సంస్కృతిని, సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
అనంతరం గ్రామ ప్రజలు, యువత, మహిళలతో ముచ్చటించిన ఎంపీ వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. ప్రజల సంక్షేమం, గ్రామాభివృద్ధికి ఎల్లప్పుడూ తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News