మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నంలోని జెడ్పీ కన్వెన్షన్ హాల్ జిల్లాలో పశుసంవర్ధక శాఖాధికారి డా. ఎన్. చి. నరసింహులు పదవీ విరమణ సన్మాన సభ ఘనంగా నిర్వహించబడింది. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు, సిబ్బంది, పశువైద్యులు మరియు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు ఘన సన్మానం చేశారు.
డా. నరసింహులు సుమారు 33 సంవత్సరాలపాటు పశుసంవర్ధక శాఖలో వివిధ హోదాలలో విశిష్ట సేవలందించి, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారిగా పదవీ విరమణ పొందారు. ఆయన సేవలను, క్రమశిక్షణను, అంకితభావాన్ని సభలో పలువురు కొనియాడారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా. టి. దామోదర్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ సీఈఓ డా. ఎం. శ్రీనివాసరావు హాజరై డా. నరసింహులు సేవలను ప్రశంసించారు. శాఖ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పలువురు అధికారులు, సహోద్యోగులు డా. నరసింహులు తో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సన్మాన కార్యక్రమం నిర్వహించి జ్ఞాపికలు అందజేశారు.
జిల్లా పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఆప్యాయ వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.
Prajavartha Online Telugu News