గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మన నగరం – మన బాధ్యత అనే నినాదంతో “ఆపరేషన్ క్లీన్ స్వీప్” లో నగర ప్రజలు విస్తృతంగా భాగస్వాములు కావాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, ‘స్వర్ణాంధ్ర – స్వచ్చాంద్ర’ సాధనలో భాగంగా “ఆపరేషన్ క్లీన్ స్వీప్” రెండో వారం కార్యాచరణ మేరకు ఈనెల 30 నుండి జూన్ 4 వ తేదీ వరకు నగరంలోని అన్ని వార్డ్ ల్లో డ్రైన్ల క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టడంలో భాగంగా స్థానిక ఐపిడి కాలనీలోని సత్యసాయి ట్రస్ట్ వద్ద అవుట్ ఫాల్ డ్రైన్ క్లీనింగ్ పనులను కమిషనర్ స్వయంగా పరిశీలించి, నగరంలోని అన్ని వార్డ్ ల్లో పూర్తి స్థాయిలో జరగాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నాలుగు వారాల ప్రత్యేక పారిశుధ్య కార్యాచరణలో భాగంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్రెండో వారం షెడ్యూల్ మేరకు ఈనెల 30 నుండి జూన్ 4 వ తేదీ వరకు నగరంలోని అన్ని వార్డుల్లో ముమ్మరంగా పారిశుధ్య కార్యక్రమాలు జరగనున్నాయన్నారు. డ్రైన్లలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు వేయడం వల్ల డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతింటుంది. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాన్నారు. డ్రైన్లలో చెత్త వేయడం వల్ల కలిగే నష్టాలపై వార్డుల వారీగా ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. గుంటూరు నగర స్వచ్ఛత కోసం జరిగే కార్యక్రమాల్లో నగర ప్రజలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం ద్వారా, మన నగరాన్ని స్వచ్ఛ నగరంగా మార్చుకోవడంలో మన వంతు పాత్ర పోషిద్దామని పిలుపునిచ్చారు.
అనంతరం స్వచ్చ ప్రతిజ్ఞ చేశారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ జి.సాంబశివరావు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, డిసిపీ సూరజ్ కుమార్, ఉపా సెల్ పిఓ సింహాచలం, మేనేజర్ బాలాజీ బాష, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నారాయణరెడ్డి, ఎస్ఎస్ లు, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News