గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో నూతనగా నిర్మిస్తున్న రెండవ యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏ.బి.సి) సెంటర్ నిర్మాణ పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ నందు ఏ.బి.సి సెంటర్ నిర్మాణం పై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
సమావేశం నందు తొలుత ప్రస్తుతం పొన్నూరు రోడ్డులో నిర్వహణలో ఉన్న ఏ.బి.సి సెంటర్ నందు రోజుకు ఎన్ని కుక్కలకు ఏ.బి.సి ఆపరేషన్ లు నిర్వహిస్తుంది తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకొని, కుక్కలకు చికిత్సలను పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రస్తుతం నగర పాలక సంస్థకు కుక్కల వలన ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పై అధిక సంఖ్యలో పిర్యాదులు అందుతున్నాయన్నారు. ప్రజల నుండి వచ్చిన పిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ప్రజారోగ్యాధికారులను ఆదేశించారు. కుక్కల పై వస్తున్న పిర్యాదులను తగ్గించుటకు నగరంలో మరో ఏ.బి.సి సెంటర్ ను యుద్దప్రాతిపదికన నిర్మిస్తున్నామన్నారు. ప్రజల నుండి వస్తున్న పిర్యాదులను దృష్టిలో ఉంచుకొని, ఏ.బి.సి ఆపరేషన్ ల సంఖ్యను పెంచాలని, ఆపరేషన్ పూర్తైన అనంతరం వాటిని ఎక్కడ పట్టుకొచ్చారో అక్కడే వదిలేయాలని ఆదేశించారు. అలాగే నూతనంగా నిర్మిస్తున్న ఏ.బి.సి సెంటర్ నిర్మాణ అనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని, సదరు సెంటర్ నందు ఏ.బి.సి ఆపరేషన్లు నిర్వహించుటకు అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
సమావేశం నందు డిప్యూటి కమిషనర్ బి. శ్రీనివాసరావు, యం.హెచ్.ఓ డాక్టర్ సురేష్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నాగేశ్వర రావు, డి.ఈ.ఈ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News