Breaking News

“ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు” కార్యక్రమం నిర్వహణ

-జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు

వాకాడు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన “ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు” కార్యక్రమాన్ని శుక్రవారం తిరుపతి జిల్లా, సూళ్ళురుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని వాకాడు తహసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి గూడూరు శాసన సభ్యులు పాశం సునీల్ కుమార్ మరియు తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవింద రావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సూళ్ళూరుపేట ఆర్డీఓ దేవేందర్ రెడ్డి, వాకాడు మరియు చిట్టమూరు తహసిల్దార్లు, మండల అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజల నుండి వాకాడు మండలానికి సంబంధించిన రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్, ఇరిగేషన్ తదితర శాఖలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు. మొత్తం 40 అర్జీలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
విభాగాల వారీగా వచ్చిన అర్జీలు ఈ విధంగా ఉన్నాయి:
రెవెన్యూ శాఖ – 26
సర్వే శాఖ – 07
పంచాయతీరాజ్ శాఖ – 04
ఇరిగేషన్ శాఖ – 03
అలాగే గత వారం నిర్వహించిన “ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు” కార్యక్రమంలో వాకాడు మండలానికి సంబంధించి మొత్తం 14 అర్జీలు అందగా, వాటిలో 2 అర్జీలు పరిష్కరించినట్లు వెల్లడించారు.
ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించడం, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *