-కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అప్యాయ పలకరిoపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
“సత్యాజీ.. మా బడా సాబ్” అంటూ కేంద్ర వస్త్ర, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఆప్యాయంగా పలకరించారు. ఇందుకు విశాఖ విమానాశ్రయం శనివారం వేదిక నిలిచిoది. సత్యకుమార్ యాదవ్ తో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని పంచుకుంటూ, ఆప్యాయంగా “సత్యాజీ బడా సాబ్”, “సత్యాజీ మా నాయకుడు” అంటూ గతంలో వారి ఇరువురు కలిసి పనిచేసిన సందర్భాలను కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు.
కేంద్ర మంత్రికి సత్యకుమార్ కృతజ్ఞతలు
దేశంలో మంజూరైన ఏకైక మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గానికి మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కి మంత్రి సత్యకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే హ్యాండ్లూమ్ రంగ అభివృద్ధి, నేతన్నల సంక్షేమం, పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై వారివురు చర్చించారు. మరోవంక భారతీయ జనతా పార్టీ జాతీయ సహ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) శివప్రకాశ్ జీని కూడా మంత్రి సత్య కుమార్ కలుసుకున్నారు.
Prajavartha Online Telugu News