విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డాక్టర్ ఎన్.టి.ఆర్. యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్ సోమవారం నిర్వహించనున్న 29, 30వ స్నాతకోత్సవాల ఏర్పాట్లను శనివారం సాయంత్రం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్యక్రమ వేదిక, అతిథుల కూర్చునే ఏర్పాట్లు, పట్టభద్రుల ప్రవేశం, భద్రతా చర్యలు, పార్కింగ్, విద్యుత్, తాగునీరు తదితర సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్, డాక్టర్ ఎన్.టి.ఆర్. యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఛాన్సలర్ ఎస్. అబ్దుల్ నజీర్ తోపాటు ఇతర ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో ఎలాంటి లోపాలకు తావులేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కార్యక్రమానికి హాజరయ్యే పట్టభద్రులు, అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Prajavartha Online Telugu News