అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో 62,34,445 మంది పెన్షన్ దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు కూటమి ప్రభుత్వం రు.2728.67 కోట్లు విడుదల చేసినట్టు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగా 5606 స్పాజ్ ( భార్య / భర్త ) పెన్షన్లు మంజూరు కాగా… ఈ లబ్ధిదారులకు రు 2.24 కోట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా విడుదల చేసినట్టు మంత్రి తెలిపారు. ఈ నిధులు అన్నీ జూన్ 1వ తేదీ సోమవారం ఉదయం నుంచే లబ్ధిదారులకు నేరుగా పంపిణీ చేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జూన్ నెలతో కలుపుకుని ఇప్పటి వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం రికార్డు స్థాయిలో రూ. 65,886.57 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. అవ్వాతాతలు, నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిధులను ప్రతి నెలా 1వ తేదీనే లబ్ధిదారులకు అందిస్తోందని మంత్రి కొండపల్లి తెలిపారు.
Tags amaravathi
Check Also
36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు
-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …
Prajavartha Online Telugu News