Breaking News

పారదర్శకంగా మెగా డీఎస్సీ… ఏ చిన్న తప్పూ జరగలేదు

-నిజాలనే రిపోర్ట్ చేయండి… అవాస్తవాలను నమ్మొద్దు
-డీఎస్సీ నిర్వహణపై వస్తోన్న అవాస్తవ కథనాలపై రిక్రూటైన టీచర్లు బాధపడొద్దు
-మెగా డీఎస్సీలో ఉద్యోగాలు దక్కించుకున్న వారంతా కష్టపడి చదివిన వారే
-నిబంధనల ప్రకారమే స్పోర్ట్స్ కోటాలో నియామకాలు
-ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ కేసులో కోర్టులు చెప్పినట్లే నడుచుకున్నాం
-హారిజాంటల్ రిజర్వేషన్ల విధానం కొందరికి అర్థం కాకపోవచ్చు
-అన్ని జిల్లాల స్కోర్స్ ముందుగానే పబ్లిష్ చేశాం
-ప్రతీ సబ్జెక్టుకు 3 వేల ప్రశ్నలు రూపొందించాం… లీకేజి అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు
-ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలు నిర్వహించిన టీసీఎస్ ఐయాన్‌తో మెగా డీఎస్సీ నిర్వహణ
-ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు పెడతాం
-విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
మెగా డీఎస్సీ-2025 నిర్వహణలో ఎలాంటి పొరపాట్లూ.. తప్పిదాలు జరగలేదని విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. గతేడాది డీఎస్సీ ద్వారా రిక్రూటైన అభ్యర్థులు ఎవరూ బాధపడవద్దన్నారు. చాలా కష్టపడి చదివి డీఎస్సీ ద్వారా ఉద్యోగాలను పొందారని అన్నారు. డీఎస్సీ నిర్వహణపై జరుగుతోన్న దుష్ప్రచారాన్ని, అవాస్తవాలను నమ్మొద్దని కోరారు. గత కొంత కొన్ని రోజులుగా మెగా డీఎస్సీ-2025 నిర్వహణపై రాజకీయ దురుద్దేశంతో కొన్ని పార్టీలు, పత్రికలు చేస్తోన్న దుష్ప్రచారానికి విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ శనివారం విద్యా భవన్ లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్సులో స్పందించారు. ఇప్పటి వరకు ఏయే అంశాల్లో దుష్ప్రచారం జరుగుతుందో.. అ అంశాలపై సృష్టించిన అనుమానాలపై పూర్తి స్పష్టతనిచ్చారు. కొన్ని రోజులుగా డీఎస్సీ నిర్వహణపై చేస్తోన్న తప్పుడు ప్రచారంలో భాగంగా లేవనెత్తిన ప్రతీ ఆరోపణా తప్పేనంటూ ఆధారాలతో సహా ప్రెస్ మీట్ నిర్వహించారు. మెగా డీఎస్సీ 2025 నిర్వహణ ప్రక్రియను ఆసాంతం వివరిస్తూ మీడియా సమావేశంలో కోన శశిధర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కోన శశిధర్ మాట్లాడుతూ…”మెగా డీఎస్సీ-2025ను అత్యంత పారదర్శకంగా నిర్వహించాం. అభ్యర్థులు కష్టపడి చదవి ఉద్యోగాలు పొందారు. 2018 తర్వాత మళ్లీ 2025లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం. డీఎస్సీ నిర్వహణను సవాల్ చేస్తూ అడ్డుకునేందుకు 241 కేసులు వేశారు. వాటిని ఎదుర్కొని.. కోర్టుల్లో సరైన వాదనలు వినిపించి.. కోర్టు అనుమతులతో రికార్డు టైంలో 148 రోజుల్లో డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేశాం. పండుగ వాతావరణంలో రిక్రూట్మెంట్ లెటర్లు ఇచ్చాం. గతేడాది జరిగిన ఈ డీఎస్సీ నిర్వహణలో తప్పిదాలు జరిగాయంటూ ఇప్పుడు మళ్లీ ఆరోపణలు రావడం వస్తున్నాయి. డీఎస్సీ నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని ఘంటా పధంగా చెబుతున్నాను. అయితే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు కాబట్టి.. ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన బాధ్యత మాపై ఉంది. మెగా డీఎస్సీ-2025ను అత్యంత పారదర్శకంగా నిర్వహించాం. అభ్యర్థులు కష్టపడి చదవి ఉద్యోగాలు పొందారు. 2018 తర్వాత మళ్లీ 2025లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం. డీఎస్సీ నిర్వహణకు టెట్ నోటిఫికేషన్ ఇవ్వడమనేది మాండేటరి కాబట్టి…. ఆ నోటిఫికేషన్ కూడా ఇచ్చాం. టెట్-డీఎస్సీ మధ్య సమన్వయం ఉంది కాబట్టే ఇంత చక్కగా నిర్వహించగలిగాం. నార్మలైజేషన్ ప్రక్రియను ఏ విధంగా చేస్తామోననే అంశాన్ని కూడా ముందుగానే వివరించాం. చిన్న పొరపాటు లేకుండా అత్యుత్తమంగా డీఎస్సీ నిర్వహించాం. టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం. ఎస్సీ వర్గీకరణ, వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేశాం. ప్రతీ అంశాన్ని ఆన్ లైన్లో పొందుపరిచాం… వెబ్ సైట్లో పెట్టాం. గడిచిన డీఎస్సీల నిర్వహణ అనుభవంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం.”అని కోన శశిధర్ చెప్పారు.

ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలు నిర్వహించిన సంస్థతో డీఎస్సీ నిర్వహణ

“154 టీసీఎస్ ఐయాన్ సెంటర్లల్లో ఈ డీఎస్సీ పరీక్షను నిర్వహించాం. ఒకే సబ్జెక్టుకు వివిధ తేదీల్లో పరీక్షలు నిర్వహించాం.. కాబట్టి వేర్వేరు పేపర్లే ఉంటాయి. ఒక్కో సబ్జెక్టుకు సుమారు 3 వేల క్వశ్చన్లతో క్వశ్చన్ బ్యాంకు రూపొందించాం. పర్మినెంట్ ఉద్యోగులైన ఇద్దరికి మాత్రమే క్వశ్చన్ బ్యాంకుకు యాక్సెస్ ఉంటుంది. ప్రతి రోజూ పాస్ వర్డ్స్ మారుతూ ఉంటాయి. ఎస్‌ఎస్‌సీ, ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్, గేట్, ఎన్టీఏ, సీఏటీ, ఏపీపీఎస్సీ, హైకోర్ట్ పరీక్షలు వంటివి నిర్వహించిన టీసీఎస్ ఐయాన్‌కే ఈ బాధ్యతలు అప్పగించాం. ఇది మాన్యువల్ ఎగ్జామ్ కాదు.. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-CBT పద్దతిలో మెగా డీఎస్సీ నిర్వహించాం. అన్ని జిల్లాల స్కోర్స్ వెబ్ సైట్లల్లో పబ్లిష్ చేశాం… టెట్, డీఎస్సీ సోర్స్ కూడా వెబ్ సైట్లల్లో పబ్లిష్ చేశాం.. ఇప్పటికీ ఉన్నాయి. స్కోర్స్ ఇవ్వలేదని చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో భాగంగా ముందుగా ఆన్ లైన్లో అప్లోడ్ చేయాలని నిబంధన పెట్టాం.. అయితే వెరిఫికెషన్ కు వచ్చినప్పుడు సర్టిఫికెట్లు తెస్తామని రిక్వెస్ట్ చేయడంతో ప్రభుత్వం అంగీకరించింది. గతానుభవాల దృష్ట్యా వెయిటింగ్ లిస్టు కాకుండా.. 1:1 పద్దతిలో పిలిచాం.. దీన్ని ఆనాడే అందరికీ చెప్పాం. వెరిఫికేషన్లో ఎవరైనా ఫెయిల్ అయితే ఆ తర్వాత వారిని వెరిఫికేషన్‌కు పిలిచాం. హారిజంటల్ రిజర్వేషన్లలో స్పోర్ట్స్, మహిళ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలు ఉంటాయి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టే కోర్టులు డీఎస్సీ-2025 నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ప్రస్తుతం పేపర్లల్లో వస్తోన్న కథనాలన్నీ హారిజాంటల్ రిజర్వేషన్లకు సంబంధించినవే. ప్రతి ఫిర్యాదును పరిశీలించాం….సమాధానాలిచ్చాం. ఎవరికైనా అనుమాలు ఉంటే.. వారికున్న అనుమానాలను నివృత్తి చేశాం. సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉంది.”అని విద్యా శాఖ కార్యదర్శి అన్నారు.

నవీన్ ఎపిసోడ్‌లో కోర్టులు మా వాదననే బలపరిచాయి

“నవీన్ అనే అభ్యర్థి ఎస్సీఈఆర్టీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి. రెండు పరీక్షలు రాశారు.. ఓ దాంట్లో 1వ ర్యాంక్, రెండో దాంట్లో 6వ ర్యాంక్ వచ్చింది. అతను సెలెక్షన్ లిస్టులో ఉన్నారు.. కానీ వెరిఫికేషన్ కోసం రాలేదు. దీంతో నిబంధన ప్రకారం అతణ్ని రిక్రూట్మెంట్ చేయలేకపోయాం. ఆ తర్వాత నవీన్ కోర్టుకు వెళ్లాడు… కోర్టుల్లో మేమూ మా వాదనలు వినిపించాం. కోర్టు మా వాదనను బలపరిచింది. నవీన్ కేసులో కోర్టులు చెప్పినట్టే నడుచుకున్నాం. అతను వెరిఫికేషన్ ప్రక్రియకు ఎందుకు రాలేదో అతనికే తెలియాలి. లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తే ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు… తప్పు పట్టలేదు. హారిజంటల్ రిజర్వేషన్లను కొందరు అర్థం చేసుకోలేకపోయారు. ప్రస్తుతం పేపర్లల్లో వస్తున్న వార్తలు అవాస్తమని చెబుతున్నాను… ఆధారాలతో సహా వచ్చాను. స్పోర్ట్స్ కోటాలో కూడా ఎలాంటి తప్పులు జరగలేదు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు దక్కించుకున్న వారు కూడా కష్టపడి ఉద్యోగాన్ని సాధించారు.”అని శశిధర్ చెప్పారు.

ప్రభుత్వ-ప్రైవేట్ బడుల మధ్య కాంపిటీషన్ ప్రారంభమైంది

“ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ-ప్రైవేట్ బడుల మధ్య కాంపిటేషన్ ప్రారంభమైంది. మా టీచర్లు పిల్లల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తున్నారు. డీఎస్సీ-2025లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి పైకి వచ్చిన వారే. డీఎస్సీ నిర్వహణపై అవాస్తవాలు చెప్పొద్దు… ఏమైనా చెప్పాలనుకుంటే నిజాలు చెప్పండి. జరుగుతున్న అవాస్తవ ప్రచారంతో కష్టపడి చదివి టీచర్ ఉద్యోగాలు దక్కించుకున్న వారందరూ బాధపడతారు. టీచర్లెవ్వరూ బాధపడొద్దని కోరుతున్నాను. శాఖాపరంగా తప్పు ఏదైనా ఉంటే చెప్పండి.. నేర్చుకోవడానికి మేం సిద్దంగా ఉన్నాం. త్వరలో మరో డీఎస్సీని కూడా నిర్వహిస్తాం. దానికీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. తప్పుడు సమాచారాన్ని ప్రజలకు పంపొద్దు. నిజాలనే రిపోర్ట్ చేయండి.. దయచేసి అబద్దాలు మాత్రం చెప్పొద్దు. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు పెట్టాం.”అని విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *