విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశంలో టి.బి ముక్త్ భారత్ అభియాన్ 2.0 కార్యక్రమంలో భాగంగా 100 రోజుల క్షయ వ్యాధి అవగాహన ప్రచార కార్యక్రమాల గురించి కేశినేని చిన్ని కి యన్.టి.ఆర్ జిల్లా అదనపు వైద్య అధికారి మరియు డి.యల్.ఎ.టి.ఒ డాక్టర్ భాను నాయక్ వివరించడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధి పై ప్రజలకు అవగాహనను కల్పిస్తూ క్షయ వ్యాధి లక్షణాలున్న వారిని, గతంలో క్షయ వాధి పడిన వారిని, వారి కుటుంబ సభ్యులను, హెచ్.ఐ.వి తో జీవిస్తున్నవారిని, ప్రైమరి కాంటాక్ట్ ఉన్న వారిని గుర్తించి వారికి టి.బి పరీక్షలు చేస్తున్నామని, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహకారంతో అత్యాధునిక ఎక్స్ రే మెషిన్ ల ద్వారా వీరిని పరీక్షిస్తున్నామని తద్వారా క్షయ వ్యాధిని ముందుగానే గుర్తించి చికిత్స చేయడానికి అవకాశం ఉందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ క్షయ ను అరికట్టే ప్రయత్నంలో ప్రభుత్వం నిర్వహించే 100 రోజుల నిక్షయ్ శిభిర్ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని కుటుంబ సభ్యులలోగాని, ఇంటి ప్రక్కన, పని చేసే ప్రదేశాలలో ఎవరికైన క్షయ వ్యాధి లక్షణాలు ఉంటే ఆశ్రద్ధ చేయకుండా పరీక్ష చెయించుకోవాలని ఒకవేల క్షయ గా నిర్ధారణ అయితే దీనికి పూర్తి చికిత్స ఉంది కనుక అందరి భాగస్వామ్యం ఉండాలని ఆయన పిలుపు నిచ్చారు. అనంతరం గోడ పత్రికను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేష్ ఎం.ఒ.టి.సి. పి.పి.యం కొఆర్డునేటర్ లీలా కుమార్, యస్.టి.యస్ ఉమా మహేశ్వరరావు, టి.బిహెచ్.వి లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News