Breaking News

పెద్ది చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను విజయవంతం చేద్దాం… : ఎంపీ కేశినేని చిన్ని

-విజయవాడ అంటేనే సినిమా పరిశ్రమ యొక్క రాజధాని
-విజయవాడ వాసులను మ్యూజిక్ తో అలరించనున్న ఏ ఆర్ రెహమాన్
-పెద్ది సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పనులు ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పనులను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని ప్రారంభించారు పెద్దిలాంటి గొప్ప చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ రావడం చాలా సంతోషమని ఎంపీ అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా పనులు ప్రారంభించిన అనంతరం ఎంపీ చిన్ని మీడియాతో మాట్లాడుతూ సినిమా పరిశ్రమ యొక్క రాజధాని విజయవాడ లాంటి ప్రాంతంలో ఇంత గొప్ప చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ రావడం సంతోషకరమని తెలిపారు విజయవాడ లో హిట్ టాక్ మొదలయితే ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా ఆదరణ అత్యద్భుతంగా ఉంటుందని ఎంపీ తెలిపారు టాలీవుడ్ బాలీవుడ్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న హీరో రామ్ చరణ్ జాన్వి కపూర్ లాంటి నటులు విజయవాడలో ఈ గొప్ప ఈవెంట్ కు రావడం విజయవాడ ప్రజలకు లెక్కలేనంత ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు పెద్ది సినిమా ఈవెంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈవెంట్ను గ్రాండ్ సక్సెస్ చేయాలని ఎంపీ ఆకాంక్షించారు శ్రేయస్ మీడియాస్ ఆధ్వర్యంలో పూర్తిగా ఈవెంట్ కార్యక్రమం జరుగుతుందని అన్నారు ఏ ఆర్ రెహమాన్ లాంటి గొప్ప వ్యక్తి కూడా ఈ ఈవెంట్లో తన పాటలతో అలరించనున్నట్లు చిన్ని తెలిపారు.

జన్జీ యుగమంతా రామ్ చరణ్ విజయవాడ రావాలని కోరుకుంటున్నారని అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వస్తే అభిమానుల ఆనందానికి కొదవే లేదని వారు కూడా రావాలని కోరుకుంటున్నట్లు ఎంపీ అన్నారు ఈవెంట్ కు కావలసిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే జిల్లా కలెక్టర్ వి ఎం సి కమిషనర్ నగర పోలీస్ కమిషనర్ మరియు జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుని ఈవెంట్ ను విజయవంతం చేస్తామని ఎంపీ అన్నారు ఆ రోజు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా ట్రాఫిక్ డైవర్షన్ పై కూడా దృష్టి పెట్టినట్లు తెలిపారు తప్పకుండా రామ్ చరణ్ మరియు ఏఆర్ రెహమాన్ కాంబోలో వస్తున్న పెద్ది చిత్రం భారీ విజయాన్ని అందుకోవాలని ఎంపీ ఆకాంక్షించారు.

త్వరలో ఏ పీ ఎల్ కూడా ప్రారంభం కాబోతోంది దానికి సంబంధించిన పనులు ఇప్పటికే పూర్తయ్యాయని ఈసారి మూడు ప్రాంతాల్లో ఏ పి ఎల్ నిర్వహిస్తున్నట్లు ఎంపీ తెలిపారు హీరో రామ్ చరణ్ మరియు ఏ పీ ఎల్ లోని టీం కెప్టెన్స్ అందరి చేతుల మీదుగా ఏపీఎల్ టీజర్ను ప్రారంభించినట్లు ఎంపీ చిన్ని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాగుల్ మీరా చిరంజీవి ఫ్యాన్స్ కృష్ణ ప్రసాద్ శ్యాం ప్రసాద్ సుగుణ బాబు మరియు శ్రేయస్ మీడియా ఈవెంట్ సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *