Breaking News

అమరావతి అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ పై దృష్టి

-హైకోర్టు భవనాల వద్ద రూ.547 కోట్లతో మౌలికసదుపాయాలు
-ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
-అమరావతి ఎకనామిక్ రీజియన్ ఆర్ఎఫ్ పీకి అంగీకారం
-సీఆర్డీఏకు సొంతంగా అగ్నిమాపక విభాగం
-ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 61వ సీఆర్డీఏ అథారిటీ
-18 అంశాలపై చర్చించి ఆమోదం తెలిపిన సీఆర్డీఏ అథారిటీ

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి రాజధానిలో భవిష్యత్ నగర నిర్మాణానికి అనుగుణంగా అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 61వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. సీఆర్డీఏ ప్రతిపాదించిన 18 అంశాలపై అథారిటీ సమావేశంలో చర్చించి ఆమోదాన్ని తెలియచేశారు. రూ.547.07 కోట్ల వ్యయంతో హైకోర్టు భవనాలకు సంబంధించిన వివిధ మౌలిక సదుపాయాల కల్పనకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదాన్ని తెలియచేసింది. పీపీపీ ప్రాతిపదికన డిజైన్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్సఫర్ విధానంలో అమరావతిలో పర్యాటకానికి ప్రోత్సాహం అందించేలా జెయింట్ అబ్జర్వేషన్ వీల్ ను నిర్మించేందుకు అథారిటీ అంగీకారం తెలిపింది. ఎల్పీఎస్ లేఅవుట్లలో వీధిపోట్లు ఉంటే ప్లాట్లలో ఏటీఎంలు, కియోస్క్ లు లాంటి వివిధ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఆమోదం ఇచ్చింది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ను పీపీపీ లేదా జాయింట్ వెంచర్ విధానంలో కల్పించేందుకు అథారిటీ ఆమోదాన్ని తెలియచేసింది. అలాగే నెగోషియబుల్ సెటిల్మెంట్ పాలసీలో భాగంగా అనువుగాలేని ప్లాట్లకు గ్రామకంఠంలో 5 సెంట్ల వరకూ కేటాయించేందుకు అథారిటీ అంగీకారాన్ని తెలిపింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు మార్గదర్శకాలకు అనుగుణంగా రాజధాని పరిధిలో దిగువ, మధ్యతరగతి ప్రజల నివాసానికి అనుగుణంగా గృహ సముదాయాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అమరావతి ప్రాంతంలో భవనాలు, అక్రమ నిర్మాణాల వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటుకు కూడా అథారిటీ ఆమోదాన్ని తెలిపింది. వివాదాలను పరిష్కరించుకునేలా అమరావతిలో ఓ మీడియేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అమరావతి రాజధానిలో ఫైర్ వింగ్ ఏర్పాటు చేసుకుని ఎన్ఓసీలను జారీ చేసేందుకు సొంత అగ్నిమాపక నియంత్రణా వ్యవస్థ ఏర్పాటుకు కూడా అథారిటీ ఆమోదాన్ని తెలియచేసింది. రాజధాని ప్రాంతంలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటుకు సంబంధించి టాబ్రీడ్ ఒప్పందాన్ని రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచేందుకు అథారిటీ ఆమోదాన్ని తెలియ చేసింది. ఎల్పీఎస్ లేఆవుట్లలోని 495 మంది రైతుల కొత్త అలాట్మెంట్ కోడ్ లు మారటంతో వారికి రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపునకు అథారిటీ అంగీకారం తెలియచేసింది.

అమరావతి ఎకనామిక్ రీజియన్ కు ఆర్ ఎఫ్ పీ

9 జిల్లాలకు విస్తరించిన అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి సంబంధించి ప్రణాళిక రూపకల్పన కోసం ఆర్ఎఫ్ పీ తయారు చేసేందుకు కూడా అధారిటీ ఆమోదాన్ని తెలిపింది. ఏలూరు నుంచి ప్రకాశం వరకూ 9 జిల్లాల్లో అభివృద్ధి ప్రణాళికల్ని రూపోదించేలా అథారిటీ సమావేశంలో సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాజధానిలోని అన్ని భవనాలు, కార్యాలయాలకు ఓ సెంట్రల్ కూలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సీఎం నిర్దేశించారు. డక్ట్ ల ద్వారా పైపుల నుంచి ఇళ్లు, కార్యాలయాలకు ఇది చేరేలా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బల్క్ చిల్లింగ్ యంత్రాల తయారీ సంస్థలు ఏపీలో ఉన్నాయని వీటిని సమర్ధంగా వినియోగించుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. బ్లూ గ్రీన్ సిటీగా నిర్మితం అవుతున్న అమరావతిలో కొత్త సాంకేతిక వ్యవస్థలపై విస్తృతమైన అవగాహన కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మితం అయ్యే ప్రతీ టౌన్ షిప్ లోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ సహా లివబుల్, కమర్షియల్ కార్యకలాపాల కేంద్రాలుగా ఉండాలని సూచించారు. రాజధాని ప్రాంతంలో ఎకనమిక్ యాక్టివిటీ ఉండేలా ప్రణాళికలు ఉండాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో నిర్మించే ఆస్పత్రుల్లో రోగుల అటెండెంట్లకు కూడా వసతి ఉండేలా చూడాలన్నారు. రాజధాని ప్రాంతంలో హోటళ్లు, కన్వెన్షన్ కేంద్రాలను వేగంగా అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, సీఎస్ జి. సాయి ప్రసాద్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, ఏడీసీ, సీఆర్డీఏ అధికారులు హాజరయ్యారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *