Breaking News

గతంలో మోసం… ఇప్పుడు నిర్లక్ష్యం ముస్లింల చిరకాల స్వప్నం ‘షాదీ ఖానా’పై టీడీపీ వైఖరి ఎండగట్టిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్

-వైఎస్ జగన్ హయాంలో రూ. 2.5 కోట్లతో నిర్మించిన షాదీ ఖానా తాళాలు వెంటనే తెరవాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గంలోని మైనారిటీ సోదర సోదరీమణుల చిరకాల కోరిక అయిన షాదీ ఖానా నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేశారు.

ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, గతంలో ముఖ్యంగా 2014 నుండి 2019 మధ్య అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (వెన్నుపోటు పార్టీ) మైనారిటీలను ఐదేళ్లపాటు మోసం చేసిందని మండిపడ్డారు.షాదీ ఖానా లేకపోవడంతో ముస్లిం సోదరులు శుభకార్యాల కోసం ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లలో వేలాది,లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు.2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత,మా ముస్లిం నాయకులు మరియు కార్పొరేటర్ల విజ్ఞప్తి మేరకు షాదీ ఖానా నిర్మాణానికి అంగీకరించారు.ఆర్ అండ్ బి (R&B) శాఖకు సంబంధించిన స్థల వివాదాలు,సాంకేతిక సమస్యలను జగన్ మోహన్ రెడ్డి గారు తన ఒక్క సంతకంతో పరిష్కరించి, ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించారు.మొదట కోటి రూపాయలు,ఆ తర్వాత శంకుస్థాపన సమయంలో అప్పటి ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా గారు మరియు ముస్లిం నాయకుల సమక్షంలో మేయర్, కమిషనర్ల ఆధ్వర్యంలో మరొక కోటి రూపాయలు… ఇలా దాదాపు రూ. 2.5 కోట్ల వ్యయంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే ఆరు నెలల్లో రెండు స్లాబుల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది.2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత షాదీ ఖానా నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, ఒక్క ఇటుక కానీ, ఇసుక కానీ వేయకుండా పనులను నిలిపివేశారని ఆరోపించారు. మేము చేసిన నిరంతర పోరాటాలు, డిమాండ్ల వల్లే కూటమి ప్రభుత్వం దిగివచ్చి మిగిలిన 5% నుండి 10% పనులను పూర్తి చేయాల్సి వచ్చిందన్నారు.ప్రస్తుత శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు మా ప్రభుత్వం లో శాంక్షన్ చేసిన పనులన్నింటికీ కొబ్బరికాయలు కొడుతూ, కేవలం పీఆర్ (PR) షోలు చేసుకుంటూ,వీడియోలు తీసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు.
తూర్పు నియోజకవర్గంలోని కాలనీల్లో రోడ్ల నిర్మాణం, పార్కుల అభివృద్ధి,వాటర్ ట్యాంకులు,కృష్ణా లంక ప్రాంతంలో రిటైనీంగ్ వాల్ నిర్మాణం, గుణదల కొండ ప్రాంత అభివృద్ధి,మెట్లు మరియు రేలింగ్ ఏర్పాటు వంటి అన్ని అభివృద్ధి పనులు జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నా ఆధ్వర్యంలోనే జరిగాయని స్పష్టం చేశారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు సంక్షేమం అందించిన పార్టీ అని గుర్తుకొస్తుంది. తెలుగుదేశం పార్టీ ఎంత అబద్ధపు ప్రచారం చేసినా ప్రజలు నమ్మరు.చంద్రబాబు ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పి నిజం అని తన ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు.మీ అనుకూల మీడియా ఉంది కదా అని రోజు గొడ్డల పార్టీ అని అంటున్నారు.మీ కూటమి ప్రభుత్వ అబద్ధపు మాటలు,అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.వైస్సార్ పార్టీ అంటే ప్రజల ఆలోచనలలో సంక్షేమం, అభివృద్ధి అని మాత్రమే ఉంటుంది అన్నారు.ఎన్టీఆర్ గారికే వెన్నుపోటు పొడిచిన చరిత్ర తెలుగుదేశం పార్టీది.రాష్ట్రంలో ఈ రోజుకి ప్రజలకి సంక్షేమాలు,అభివృద్ధి అందించలేక వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు.రాజకీయ కక్షసాధింపు చర్యలు పక్కన పెట్టి,ముస్లిం మైనారిటీల ప్రయోజనాల దృష్ట్యా అధికారులు,కమిషనర్ మరియు స్థానిక ఎమ్మెల్యే స్పందించి… తాళాలు వేసి ఉన్న షాదీ ఖానాను వెంటనే తెరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ అలీమ్,స్టేట్ మైనార్టీ సెక్రటరీ బినియా,జిల్లా మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ ఉస్మాన్, నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షుడు సుభాని,మండల అధ్యక్షుడు ప్రభుదాస్, మైనారిటీ నాయకులు షరీఫ్, బాషా,అబ్బాస్,సికిందర్,బజాని,ముక్తార్,సలీం,రత్నా కుమారి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *