Breaking News

గిరి ప్రదక్షిణ భక్తులకు మజ్జిగ పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం వారు ఆదివారం  అధిక జేష్ఠ మాస పౌర్ణమి పురస్కరించుకుని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను ఉత్సవ మూర్తులుగా భక్తులకు రథంపై ఊరేగింపుగా వెళ్తూ దర్శనం ఇచ్చే విధంగా ‘ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ’ కార్యక్రమం నిర్వహించింది. ఈరోజున శ్రీ దుర్గా మల్లేశ్వరులు, శ్రీ విఘ్నేశ్వరుడు, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ ఆంజనేయస్వామి వంటి సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వలన కోరిన కోరికలు తీరుతాయని అందుకే భక్తుల దగ్గరకే పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేయడం మరింత శ్రేష్టమని శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా శ్రీ అమ్మ ఆది గణపతి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో చిట్టి నగర్ లోని మరుపిళ్ళ చిట్టి గారి పార్క్ వద్ద ఏర్పాటుచేసిన ఆది గణపతి మండపం వద్ద ఉన్న ఆది గణపతి చిత్రపటానికి కమిటీ సభ్యులు పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ దుర్గా మల్లేశ్వరులు కొలువైన వాహనం ముందు కమిటీ సభ్యులు పసుపు నీళ్లతో శుద్ధి చేసి అమ్మవారికి చీర, గాజులు, పసుపు కుంకుమ సమర్పించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ వచ్చు భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు గర్రె రమేష్ ,మరియు మజ్జిగ దాతలు 47 వ డివిజన్ తెదెపా నాయకులు మల్లెపు రాజు దంపతులు, కమిటీ సభ్యులు గర్రె వెంకటేశ్వరరావు , దేవిన హరి ప్రసాద్,కరణం దివాకర్, చలపాక సురేష్, బూడిద దుర్గాప్రసాద్, కొరగంజి మాధవ్, భూపతి ప్రసన్న కుమార్ దంపతులు, ముత్యాల రాము ఫ్రెండ్ సర్కిల్, భవాని భక్తులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *