-పొగాకు, గుట్కా, ఖైనీకి దూరంగా ఉండాలి ..
-ఆరోగ్యకర సమాజాన్ని నిర్మాణం లో భాగస్వాములు కండి..
-పొగాకు రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం..
-జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఊపిరితిత్తులు, క్యాన్సర్ వ్యాధులకు కారణమైన పొగాకు, గుట్కా, ఖైనీ వంటి మత్తుపదార్థాల నుండి ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే లా ప్రజలను చైతన్యవంతులను చేసి పొగాకు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్న సంకల్పం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు.
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కలెక్టరేట్ వద్ద వైద్య ఆరోగ్య కుంటుంబ సంక్షేమ శాఖ అధికారులు సిబ్బంది స్వచ్చంద సంస్థల ప్రతినిధులు విద్యార్థిని విద్యార్దులతో ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ ప్రారభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పొగాకు వినియోగంతో మన శరీరంలోని ప్రధాన అవయవాలకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ప్రాణాంతకమైన నికోటిన్ వలన ఊపిరితిత్తులు దెబ్బతినడమే కాకుండా క్యాన్సర్‌తో పాటు పక్షవాతము, అంధత్వము, రక్తనాళాలు గట్టిపడటం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉదన్నారు. ఇప్పటికే పొగాకు, దూమపానం వంటి అలవాట్లు ఉన్నవారు తమ అలవాట్ల దూరం గా ఉండాలన్నారు. దన, ప్రాణ, మానవ హానికి కారణమవుతున్న పొగాకు, మత్తు పదార్థాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండి స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యం సాధనలో భాగంగా ఆరోగ్యకర సామాజ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలన్నారు. విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరపకూడదనే నిబంధనను జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యువతీ యువకులు పొగాకు ఉత్పత్తుల వినియోగ వ్యామోహంలో పడకుండా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వారి అలవాట్లను గమనించాలని సూచించారు. స్వచ్చంద సంస్థల ద్వారా కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో పొగాకు దుష్పలితాల అంశంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. పొగాకు ఉత్పత్తుల అలవాటు పడిన వారు మానుకునేందుకు జిల్లా ఆసుపత్రిలోని డి`అడిక్షన్ కేంద్రాల ద్వారా కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. కోట్పాయాక్ట్ జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానికంగా పొగాకు నిషేద ఉత్పత్తుల అమ్మకాలు జిల్లాలో జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
ఎ పి ఈగిల్ ఐ జి కె.రవికృష్ణ మాట్లాడుతూ, యువతను లక్ష్యంగా చేసుకుని పొగాకు పరిశ్రమలు అనుసరిస్తున్న ప్రచార వ్యూహాలను గుర్తించి వాటిని ఎదుర్కొనేందుకు సమాజంలోని అన్ని వర్గాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా “ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమం ద్వారా విద్యాసంస్థల పరిసరాల్లోని అక్రమ పొగాకు విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, కోప్టా చట్టంలోని సెక్షన్ 6(b) ప్రకారం విద్యాసంస్థలకు 100 గజాల పరిధిలో పొగాకు
ఉత్పత్తుల విక్రయాలను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే, పొగాకు వ్యసనం అనేది అనేక ఇతర మాదక ద్రవ్యాలు మరియు వ్యసనాలకు అలవాటు ప్రమాదం ఉందని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే పొగాకు లేదా నికోటిన్ ఉత్పత్తుల వినియోగానికి అలవాటు పడిన యువత, భవిష్యత్తులో మద్యం, మాదక ద్రవ్యాలు మరియు ఇతర హానికర వ్యసనాల వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని వివరించారు. అందువల్ల విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేసి యువతను అన్ని రకాల వ్యసనాల నుండి రక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు.
కార్యక్రమం లో రాష్ట్ర ఎన్ టి సి పి కన్సల్టెంట్ డా. వి. సౌజన్య లక్ష్మి, ప్రముఖ వైద్యులు మరియు ఎన్టీఆర్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డా. జి.సమరం, రాష్ట్ర వి హెచ్ ఏ ప్రధాన కార్యదర్శి శ్రీ షేక్ ఇస్మాయిల్ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ మన్మోహన్, ఈగల్ ఎస్ పి లు నగేష్ బాబు, ప్రభాకర్, స్వరూప రాణి, ఎన్టీఆర్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. మాధవి, జిల్లా యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్, జిల్లా డి ఎస్ డి ఓ కోటేశ్వరరావు, ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ కోఆర్డినేటర్ అరవ రమేష్ , స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు నవజీవన్ బాల భవన్,హెల్త్ కేర్ అండ్ సోషల్ సర్వీస్ సొసైటీ,ఆకర్ష ఫౌండేషన్, రెడ్ క్రాస్ వాలంటీర్లు వివిధ కళాశాలఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News