Breaking News

సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ గా బాధ్యతలు చేపట్టిన తేళ్ల కస్తూరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ గా తేళ్ల కస్తూరి సోమవారం (జూన్ 1 న) స్థానిక మీడియా అకాడమీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. పూర్వపు సెక్రెటరీ మణిరామ్ రిటైర్మెంట్ కారణంగా ప్రస్థుతం జోన్ 3 జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తోన్న తేళ్ల కస్తూరి కి ‘సెక్రెటరీ’ గా పూర్తి అదనపు బాధ్యతలు కల్పిస్తూ సమాచార శాఖ డైరెక్టర్ ఉత్తరువులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఉత్తరువుల ను అనుసరించి సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ గా పూర్తి అదనపు బాధ్యతలు ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా అకాడమీ మేనేజర్ ఎం. భాస్కర నారాయణ అకాడమీలో అమలవుతోన్న పలు కార్యక్రమాలను సెక్రెటరీ తేళ్ల కస్తూరి కి వివరించారు. ఈ సందర్భంగా పూర్వపు మీడియా అకాడమీ సెక్రెటరీ  మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్, పలువురు పాత్రికేయులు సెక్రెటరీ కస్తూరి బాయి ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *