-విజయవాడ కార్యాలయంలో నాలుగు మండలాల అధికారులతో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సమీక్ష సమావేశం
-నియోజకవర్గ అభివృద్ధి పనులు, పెండింగ్ అంశాలపై చర్చ
-అభివృద్ధి పనులను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని ఆదేశాలు
-ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచన
-పనుల్లో నిర్లక్ష్యం, జాప్యం సహించబోమని అధికారులకు హెచ్చరిక
-ప్రభుత్వ హామీల అమలులో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచన
-బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఎమ్మెల్యే పిలుపు
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. సోమవారం విజయవాడలోని తన కార్యాలయంలో నాలుగు మండలాలకు చెందిన అధికారులతో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, వివిధ శాఖలకు సంబంధించిన పెండింగ్ పనులు, ప్రజల నుంచి అందుతున్న వినతులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధి కార్యక్రమాల పూర్తి విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో చేపట్టిన రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, ఇతర సమస్యల కు సంబంధించిన పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని, అనవసర కారణాలతో పనులను పెండింగ్‌లో ఉంచడాన్ని సహించబోమని స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల అమలులో నిర్లక్ష్యం లేదా అలసత్వం ప్రదర్శిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన లక్ష్యమని, ప్రతి అధికారి ప్రజలకు జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, గ్రామాల స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News