Breaking News

ఘనంగా pre-convaction (ఫ్రీ కాన్వికేషన్) వేడుకలు

-అవార్డు గ్రహీతలను అభినందించిన మంత్రి సత్య కుమార్ యాదవ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 29వ, 30వ స్నాతకోత్సవ వేడుకలు విజయవాడలో మంగళవారo
జరగనున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విశ్వవిద్యాలయంలో సోమవారం రాత్రి “pre convocation” సమావేశం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. దీనికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
సీనియ‌ర్ కార్డియాల‌జిస్ట్‌ డాక్టర్ సి.నరసింహన్, పి. సి. రాత్ ( విశ్వవిద్యాలయ డాక్టర్ ఆఫ్ సైన్స్ స్ ) అవార్డు గ్రహీతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిని సబికులకు విశ్వ విద్యాలయ ఉప కులపతి డాక్టర్ చంద్రశేఖర్ పరిచయం చేశారు. వైద్య విద్య రంగంలో విశ్వవిద్యాలయ కృషిని గ్రహితలు ప్రసంగాల ద్వారా ప్రశoసిoచారు.
మంత్రి సత్య కుమార్ వీరిని సమచిత రీతిన సత్కరించారు. వారి సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం పూర్వ ఉప కులపతులు సీవీ రావు, శ్యామ్ ప్రసాద్ సేవలను గుర్తుచేస్తూ మంత్రి సముచిత రీతిన సత్కరించారు. ఈ కార్యక్రమంలో హై పవర్ కమిటీ చైర్మన్ జస్టిస్ దుర్గాప్రసాద్, మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ అహతం శాంతాసింగ్,
ఏపీ మెడికల్ కౌన్సిల్ ముఖ్యులు,
ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు సబికులను అలరించాయి.

విద్యార్థులకు మెడల్స్ ప్రదానం

డాక్ట‌ర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాల‌యం (Dr NTR University of Health Sciences) 2024, 2025 సంవ‌త్సరాలకు సంబంధించి 29వ‌, 30వ స్నాత‌కోత్స‌వ వేడుకలు మంగళవారం విజ‌య‌వాడ‌లోని తుమ్మ‌ల‌ప‌ల్లి వారి క్షేత్ర‌య్య క‌ళాక్షేత్రంలో జరగనున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ జ‌స్టిస్ ఎస్‌. అబ్దుల్ న‌జీర్ అధ్య‌క్ష‌త వ‌హించే స్నాత‌కోత్స‌వాల‌కు హైద‌రాబాద్ ఎఐజి హాస్పిట‌ల్స్ అరిథ్మియా మ‌రియు ఎల‌క్ట్రోఫిజియాల‌జీ స‌ర్వీసెస్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ సి.న‌ర‌సింహ‌న్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆయా సబ్జెక్టుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన యూజీ, పీజీ, పీహెచ్ డీ విద్యార్థిని విద్యార్థులకు 29వ స్నాతకోత్సవంలో 62 గోల్డ్ మెడల్స్, 21 సిల్వర్ మెడల్స్, 18 ఎండోమెంట్ బహుమతులు, అలాగే 30వ స్నాతకోత్సవంలోj 61 గోల్డ్ మెడల్స్, 18 సిల్వర్ మెడల్స్, 19 ఎండోమెంట్ బహుమతులు ప్రదానం చేయనున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *