Breaking News

ఎన్డీఏ కార్యాలయంలో తొమ్మిదో రోజు ప్రజా దర్బార్ కు విశేష స్పందన

-కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించిన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో పశ్చిమ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికి భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో తొమ్మిదో రోజు కూడా నిర్వహించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభించింది. సోమవారం నిర్వహించిన ఈ ప్రజా దర్బార్ లో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు, టీడీపీ, బీజేపీ ,జనసేన నేతలతో కలిసి వినతులు స్వీకరించారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నారు. ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు అందజేశారు. ఆయా సమస్యలను సంబంధిత అధికారుల ద్వారా పరిష్కారం అయ్యేలా చర్యలు చేపడుతున్నారు.

మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం టీడీపీ మాజీ కార్పొరేటర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్
టీడీపీ మాజీ కార్పొరేటర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారికి మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.

సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి
పశ్చిమ నియోజకవర్గం లోని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి నిరంతరం ఎన్డీఏ కార్యాలయంలో ప్రజా దర్బార్ ను నిర్వహిస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి తెలిపారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు

ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నేత బంకా నాగమణి,కూటమి నేతలు కామ దేవ రాజ్, సయ్యద్ కరిముల్ల, నాగోతీ రామారావు , బొల్లేపల్లి కోటేశ్వరరావు, ఏలూరు సాయి శరత్, గన్నవరపు శ్రీనివాసరావు, పగడాల కృష్ణ, దేవిన హరి ప్రసాద్, బొబ్బిలి లీలా కుమార్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *