-“టిడ్కో ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 34 వ డివిజన్ లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎంపీ చిన్ని పాల్గొన్నారు రాష్ట్రంలోని పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలవుతున్నాయని, ప్రతి అర్హుడికి గౌరవప్రదంగా పెన్షన్లు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
“పెన్షన్ అనేది కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాదు, మన పెద్దల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న గౌరవానికి ప్రతీక అని ఆయన తెలిపారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పెన్షన్లు అందజేస్తూ వారి జీవితాల్లో భరోసా నింపుతున్నామన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది” అని ఎంపీ పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 63 నుంచి 64 లక్షల మంది వరకు ఎన్‌టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పొందుతున్నారని, ఇందుకోసం ప్రభుత్వం నెలకు సుమారు రూ.2,700 కోట్లకు పైగా వ్యయం చేస్తోందని తెలిపారు. ఏడాదికి ఈ వ్యయం దాదాపు రూ.33,000 కోట్లకు చేరుతుందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఎటువంటి రాజీ పడకుండా ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు.
అదేవిధంగా, పేదలకు సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో గృహాల నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేయడానికి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.273.79 కోట్ల విడుదలకు పరిపాలన అనుమతులు మంజూరు చేసిందని చెప్పారు.
టిడ్కో గృహ సముదాయాల్లో పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేయడంతో పాటు రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీటి వంటి సదుపాయాల అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయని వివరించారు. దీంతో వేలాది మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరడమే కాకుండా, ఇళ్ల పంపిణీ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని తెలిపారు.
“*విజయవాడలో ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చడమే నా ధ్యేయం.సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది” అని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ పంపిణీ, గృహ నిర్మాణ కార్యక్రమాలు రాష్ట్రంలో సామాజిక భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు పేదల జీవితాల్లో కొత్త ఆశలను నింపుతున్నాయని ఎంపీ తెలిపారు
ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ పరిశీలకుడు వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్ 34 వ డివిజన్ అధ్యక్షులు అట్లూరి కొండా, క్లస్టర్ ఇంచార్జి కొట్టేటి హనుమంతు రావు డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆకుల తన్వి, నాయుకులు అబీబ్, భూషణం శ్రీనివాస్ సుబ్రమణ్యం, మున్నిసా లక్ష్మీ దాసు వెంకటేశ్వరరావు కే అప్పారావు సుబ్బారావు మరియన్న బాబ్జి కాటం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News