Breaking News

తిరుపతి–రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి రైల్వే స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన తిరుపతి–రక్సౌల్ ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 17433/17434) ప్రారంభోత్సవ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి జెండా ఊపి రైలు తొలి ప్రయాణాన్ని ప్రారంభించారు. గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన ఈ రైలు ఇప్పుడు సాధారణ రైలు అందుబాటులోకి తీసుకురావడం పట్ల ఎంపీ మద్దిల గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. ఈ రైలు సేవ ద్వారా తిరుపతి ప్రాంత ప్రజలకు ఉత్తర భారత రాష్ట్రాలతో మరింత మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని తెలిపారు. భక్తులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు మరియు ఇతర ప్రయాణికులకు ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తిరుపతి అభివృద్ధికి, ప్రజల రవాణా అవసరాల తీర్చడానికి కేంద్ర, రైల్వే శాఖల సహకారంతో మరిన్ని రైలు సౌకర్యాల కోసం కృషి కొనసాగిస్తామని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, ప్రయాణికులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *