Breaking News

ఆంధ్రరత్నభవన్లో నీలం సంజీవరెడ్డి వర్ధంతి కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రాజకీయ చరిత్రలో రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, లోక్ సభ స్పీకర్ వంటి అత్యున్నత పదవులను అధిరోహించిన ఏకైక వ్యక్తి నీలం సంజీవరెడ్డి అని ఏపీ సీసీ ఉపాధ్యక్షుడు వి.గురునాథం, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు పేర్కొన్నారు. సోమవారం ఆంధ్రరత్నభవన్లో సంజీవరెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా పని చేశారని కొనియాడారు. ఆయన నిస్వార్థ సేవలను నేటి తరం రాజకీయ నాయకులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా కాపు సెల్ అధ్యక్షుడు అల్లం రాజేష్ తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *