విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ద్రావిడ ఉద్యమనేత ముత్తువేల్ కరుణానిధి 103వ జయంతి సందర్భంగా బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈనెల 3న బహుజన మాట- పాట అనే సాం స్కృతిక చైతన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు బీసీ చైతన్య వేదిక ప్రతినిధులు వీరవల్లి శ్రీనివాస్, పానుగుపాటి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో వారు ఈ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జాతీయ కో-ఆర్డినేటర్ పూర్ణచంద్రరావు, ఐఏఎస్ మాజీ అధికారి పీవీ రమేష్, నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ వీజీఆర్ నారగోని ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలు ఐక్యంగా ముందుకు రావాలని, కార్యక్రమంలో పాల్గొని విజయవం తంగా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పొట్లూరి దేవి, బీసీ చైతన్య వేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News