Breaking News

న్యూఢిల్లీలోని ఏపీఐసీ ప్రత్యేక అధికారిగా బాధ్యతలను స్వీకరించిన తేళ్ల కస్తూరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఒంగోలు జోన్-3 ప్రాంతీయ సంయుక్త సంచాలకులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న తేళ్ల కస్తూరి సోమవారం సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనరేట్ లో న్యూఢిల్లీలోని ఏపీఐసీ ప్రత్యేక అధికారి గా బాధ్యతలు స్వీకరించారు.

సమాచార పౌర సంబంధాల శాఖలో అడిషనల్ డైరెక్టర్ (ఇంచార్జ్) గా విధులు నిర్వహిస్తూ, న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఏపీఐసీ) ప్రత్యేక అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించిన పి. కిరణ్ కుమార్ ఈ నెల 31 న పదవీ విరమణ చేసిన నేపథ్యంలో తేళ్ల కస్తూరి కి బాధ్యతలు అప్పగించారు. ఏపీఐసీ ప్రత్యేక అధికారి బాధ్యతలను ఒంగోలు జోన్-3 ప్రాంతీయ సంయుక్త సంచాలకులు తేళ్ల కస్తూరికి అప్పగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ ఉత్తర్వులు జారీ చేసారు. సంచాలకులు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు తేళ్ల కస్తూరి న్యూఢిల్లీలోని ఏపీఐసీ ప్రత్యేక అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం న్యూఢిల్లీలోని ఏపీఐసీ ప్రత్యేక అధికారి, ఒంగోలు జోన్-3 ప్రాంతీయ సంయుక్త సంచాలకులు తేళ్ల కస్తూరి సమాచార పౌర సంబంధాల సంచాలకులు కేఎస్ విశ్వనాథన్ ను మర్యాదపూర్వకంగా కలిసారు.

సుదీర్ఘ సర్వీస్ ప్రస్థానం

21 డిసెంబర్ 2001 నాడు, ఏపీపీఎస్సీ ద్వారా జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిగా రంగారెడ్డి జిల్లాలో నియమితులయ్యారు. తదనంతరం డిపిఆర్ఓగా హైదరాబాద్ జిల్లాలో ఆమె సేవలు అందించారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ప్రమోషన్ పొందిన తర్వాత ఉమ్మడి రాష్ట్ర పబ్లిసిటీ సెల్ లో బాధ్యతలు నిర్వహించి, ప్రధమ మహిళా సిపిఆర్ఓ టూ డిజిపిగా బాధ్యతలు చేపట్టి, సమర్థవంతంగా పనిచేశారు. అనంతరం ప్రధమ మహిళ సిపిఆర్ఓ టూ జిహెచ్ఎంసి గా సేవలందించారు. రాష్ట్ర విభజన అనంతరం తన మాతృ సంస్థ అయిన సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ కు కేటాయించబడి డిప్యూటీ డైరెక్టర్ గా పదోన్నతి పొందారు. డిప్యూటీ డైరెక్టర్ గా పబ్లిసిటీ సెల్ నందు, మీడియా రిలేషన్స్ లో, అడ్మినిస్ట్రేషన్ లో తన సేవలు అందించారు. 2019 లో జాయింట్ డైరెక్టర్ గా పదోన్నతి పొంది అడ్మినిస్ట్రేషన్, మీడియా రిలేషన్స్, ప్రింట్ మీడియా అడ్వర్టైజ్మెంట్ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం ఆర్జేడి -3 ఒంగోలుగా గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల బాధ్యతలను ఆమె నిర్వహిస్తున్నారు. తన 24 ఏళ్ల సర్వీస్ లో దాదాపు 25 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల దగ్గర పనిచేసి ఉత్తమ అధికారిగా మన్ననలు పొందారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *