Breaking News

సజావుగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఈ రోజు నిర్వహిస్తున్న SSC అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు (బయోలాజికల్ సైన్స్ పరీక్ష) మరియు APOSS ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మే–2026 లో భాగంగా 314–జీవశాస్త్రము, 319–వాణిజ్య/వ్యాపార శాస్త్రము, 321–గృహవిజ్ఞాన శాస్త్రము పరీక్షలు సజావుగా కొనసాగాయి. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి. సుబ్బారావు మచిలీపట్నం పట్టణ పరిధిలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణను పరిశీలించారు. నిర్మల హై స్కూల్, ఎం.పి.ఎల్. హై స్కూల్ పార్క్ మరియు శ్రీ బాలాజీ విద్యాలయంలో నిర్వహిస్తున్న SSC అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ మరియు APOSS ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, నిబంధనలకు అనుగుణంగా సక్రమంగా నిర్వహించబడుతున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *