గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన నగర కమిషనర్ మయూర్ అశోక్. జూన్ 3న పివియస్ లలితా హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వర్యులు రానున్న నేపథ్యంలో హెలిప్యాడ్, నేషనల్ హై వే, హాస్పిటల్ ఆవరణ, సభాప్రాంగణం తదితర ప్రాంతాలను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జూన్ 3, బుధవారం పివియస్ లలితా హాస్పిటల్ ప్రారంభోత్సవానికి గుంటూరు రానున్న సందర్భంగా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్, నేషనల్ హై వే, హాస్పిటల్ ఆవరణ, సభాప్రాంగణం తదితర ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించి, సదరు ప్రాంతాలలో పారిశుధ్యం పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి గారి పర్యటన జరుగు సమయంలో సమీప గ్రామాల ప్రజలు వారి పశువులు రోడ్లపైకి వదలకుండా చర్యలు తీసుకువాలన్నారు. సి.యం గారి భద్రత పరంగా తీసుకోవాల్సిన అంశాల పై పోలీస్ శాఖ వారి సూచనల ప్రకారం చర్యలు చేపట్టాలని నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సభాప్రాంగణం వద్ద పారిశుధ్య పనుల పై అధికారులు ద్రుష్టి సారించాలని, సదరు ప్రాంతంలో పారిశుధ్య పరంగా ఎటువంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్యాదికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు కలిసి గౌరవ సియం గారి గుంటూరు పర్యటనలో ఎటువంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సదరు పర్యటనలో డిప్యుటీ కమిషనర్ బి. శ్రీనివాసరావు, యం.హెచ్.ఓ డాక్టర్ సురేష్, రెవిన్యూ అధికారులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News