విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదిన వేడుకలు భవానిపురం శ్రీ వెంకట సాయి వృద్ధాశ్రమంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎన్డీఏ కూటమి మాజీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జన్మదిన వేడుకలలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , కార్పొరేటర్లతో కలిసి కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు, నెలకి సరిపడా బియ్యం, నిత్యవసరాలను అందజేశారు..
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదినోత్సవ వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా పండుగ వాతావరణం లో జరుపుకోవడం శుభ పరిణామం అన్నారు..
ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే సుజనాను తమ కుటుంబ సభ్యుడిగా భావించి ఆయన జన్మదిన వేడుకలను విజయవంతం చేశారని తెలిపారు..
నెలకు సరిపడా నిత్యవసరాలను వృద్ధాశ్రమానికి డొనేట్ చేసిన కూటమి కార్పొరేటర్ లను అభినందించారు..
బీజేపీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ పశ్చిమ అభివృద్దే లక్ష్యంగా నిరంతరం పాటుపడుతున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదిన వేడుకలు వృద్ధాశ్రమంలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.. అల్లా, జీసస్, దుర్గమ్మ వారి ఆశీస్సులు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎల్లవేళలా ఉండాలని , మరింత సేవ చేయాలని ఆయురారోగ్యాలతో ఉండాలని బుల్లా విజయ్ ఆకాంక్షించారు…
జనసేన మాజీ కార్పొరేటర్ మరుపిళ్ళ రాజేష్ మాట్లాడుతూ వెంకట సాయి వృద్ధాశ్రమం అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ విషయాన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకెళ్తామన్నారు..
తమ వంతు సహాయ సహకారాలను వృద్ధాశ్రమానికి అందిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే సుజనా ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు…
మాజీ కార్పొరేటర్ మహాదేవు అప్పాజీరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గాన్ని ఏపీ లోనే అగ్రగామిగా నిలిపారన్నారు
అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి అడుగుజాడల్లో నడుస్తామని కార్పొరేటర్లు అందరం అభివృద్ధికి సహకరిస్తామన్నారు..
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మైలవరపు రత్నకుమారి దుర్గారావు, అత్తలూరి ఆదిలక్ష్మీ పెదబాబు, టీడీపీ సీనియర్ నాయకులు మైలవరపు కృష్ణ పాల్గొన్నారు…
Prajavartha Online Telugu News