Breaking News

రైల్వే ప్రాజెక్టులు, భూసేకరణ, జాతీయ రహదారులు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

-రెవెన్యూ పీ.జీ.ఆర్.ఎస్, రిసర్వే, 22A నిషేధిత జాబితా కేసులను మొదటి ప్రాధాన్యత తో పరిష్కారం చూపాలి
-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రైల్వే ప్రాజెక్టులు, భూసేకరణ, జాతీయ రహదారులు నిర్మాణ పనులను,భూ సమస్యలు, రెవెన్యూ పీ.జీ.ఆర్.ఎస్, రిసర్వే, 22A నిషేధిత జాబితా కేసుల పరిష్కారం, మాన్యువల్ రెవెన్యూ రికార్డుల డిజిటలీకరణ, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, త్వరితగతిన పూర్తి చేయాలని,రైల్వే ప్రాజెక్ట్ పనులు,శ్రీ సిటీ ఫేస్ -2, ఎల్ జి ఫేస్-2, కొల్లాడం, ఇరుగుళం, పెద్దేటిపాకం, రాళ్లకుప్పం, స్పేస్ సిటీ ఫేస్ 1, 2,3,4, నాయుడుపేట ఫేస్ 2, వానెల్లూరు, పాగలి, రాయల్ ఎంఫిల్డ్, జాతీయ రహదారులు, వైజాగ్ చెన్నై కారిడార్ ఫైపు లైన్ పనులు,ఏ డీబి రోడ్డులు, దుగ్గరాజపట్నం పనులు, కృష్ణపట్నం పోర్ట్, రైల్వే ప్రాజెక్ట్ పనులు, ఏపీఐఐసీ సంబంధించి శ్రీ సిటీలోని ఎల్జి కంపెనీకి సంబంధించి పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులపై సమీక్షా పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులను ప్రణాళిక భద్దంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవింద రావు, జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులుతో కలసి జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ సమీక్షా నిర్వహించి దిశా నిర్దేశం చేసారు.

మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని మిని సమావేశ మందిరంలో రైల్వే ప్రాజెక్ట్ పనులు,రాయల్ ఎంఫిల్డ్ జాతీయ రహదారులు, వైజాగ్ చెన్నై కారిడార్ పైప్ లైన్ పనులు, ఏపీఐఐసీ సంబంధించి దుగ్గరాజపట్నం పనులు, శ్రీ సిటీ ఫేస్ -2, ఎల్ జి ఫేస్-2,స్పేస్ సిటీ ఫేస్ 1, 2,3,4, నాయుడుపేట ఫేస్ 2, వానెల్లూరు, పాగలి, అంశాలు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలు, ఏ డీబి రోడ్డులపై నిర్మాణ పురోగతి పనులపై జిల్లా కలెక్టర్ వర్చువల్ విధానంలో తిరుపతి, నెల్లూరు , చెన్నై నేషనల్ హైవే పి డి లు, రైల్వే ప్రాజెక్టు అధికారి వామన మూర్తి, సదరన్ రైల్వే అధికారి శశిభూషన్,నెల్లూరు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఎల్. శివకుమార్, శ్రీ సిటీ జనరల్ మేనేజర్ భగవాన్,ఈ ఈ ఇరిగేషన్ సంబంధిత మండలాల తహసీల్దార్లు, కాంట్రాక్టర్లు,తదితర సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..శ్రీ సిటీ ఫేజ్ -2, ఏ పి ఐ ఐ సి లోని ఎల్ జి ఫేజ్ -1,2, 3 రాయల్ ఎంఫిల్డ్,.కొల్లాడం, ఇరుగుళం,పెద్దేటిపాకం,రాళ్లకుప్పం, శ్రీ సిటీ ఫేజ్ -1, 2,3,4, నాయుడుపేట ఫేస్ 2, వానెల్లూరు, పాగలి, ప్రాజెక్టు లకు సంబందించిన పెండింగ్ భూసేకరణ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టు లకు సంబందించిన పెండింగ్ కోర్టు కేసులను కూడా త్వరగా పరిస్కారం అయ్యేలా చూడాలన్నారు. వెబ్ ల్యాండ్ పై వున్న సమస్యలను సత్వరమే పరిస్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతి జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి కొరకు చేపడుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులు, వైజాగ్ చెన్నై కారిడార్ పైపు లైను పనులు, రైల్వే ప్రాజెక్ట్స్ పనులు పురోగతిలో ఉన్న పనులపై నడికుడి – శ్రీకాళహస్తి, ఏర్పేడు – పూడి, గుమ్మడి పూండి-గూడూరు, గూడూరు-రేణిగుంట, తిరుపతి – కాట్పడి, తిరుపతి – పాకాల, అర్కొణం – రేణిగుంట, సంబంధించిన రైల్వే ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలన్నారు. ఆరు లైన్లు రహదారులు నిర్మాణం, నాయుడుపేట-రేణిగుంట, రేణిగుంట- కడప రేణిగుంట నుండి చెన్నై రహదారుల పనులు పూర్తి చేయాలని భూ సేకరణకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ప్యాకేజీ 2,3,4 జాతీయ రహదారి పనులు సాగరమాల కింద చేపట్టిన వాటిని పెండింగ్ లేకుండా రెవెన్యూ డివిజనల్ అధికారులు నేషనల్ హైవే అధికారులతో సమన్వయంతో చేసుకొని నాణ్యత తో పనులు పూర్తి కావాలని అన్నారు. ఎయిర్పోర్ట్, ఇస్సేర్, కరకంబాడి, ఎమ్ ఐ జి లే అవుట్ తిమ్మాజికండ్రిగ, పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలను ఆదేశించారు. అలాగే ఆర్ అండ్ బి , పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఇరిగేషన్ ఫారెస్ట్, జల వనరుల శాఖ అధికారులు అందరూ కలసి సమన్వయంతో పెండింగ్ పనులను నిర్దేశించిన గడువు లోపల పూర్తి చేయాలన్నారు. ఏపీఐఐసీ ప్యాకేజీ 5, ఎడిబి రోడ్లు పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు

రెవెన్యూ పీ.జీ.ఆర్.ఎస్. ద్వారా అందిన ప్రజా ఫిర్యాదులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. రీ-సర్వే కార్యక్రమాన్ని నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి భూ యజమానుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని పేర్కొన్నారు.

22A నిషేధిత జాబితాలో ఉన్న కేసులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హత కలిగిన వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. మాన్యువల్ రెవెన్యూ రికార్డుల డిజిటలీకరణ ప్రక్రియను వేగవంతం చేసి, భూ రికార్డులను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

అలాగే అర్హులైన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలని, ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత సులభంగా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, తిరుపతి,శ్రీకాళహస్తి సూళ్లూరుపేట ఆర్డీఓలు, రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, దేవేంద్ర రెడ్డి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు భరత్ నాయక్, రోజ్ మాండ్, ఆర్ అండ్ బి ఎస్ ఈ రాజా నాయక్,ఎస్ ఈ పంచాయతీ రాజ్, ఎస్ ఈ, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖ అధికారి ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్స్ ఇంచార్జి రాంప్రసాద్, ఏపీఐఐసీ తిరుపతి జోనల్ మేనేజర్ విజయ్ భరత్ రెడ్డి, సంబంధిత తహసీల్దార్లు, డెప్యూటీ తహసీల్దార్లు , సెక్షన్ ఆధికారులు భాస్కర్, చైతన్య, భూసేకరణ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *