విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ కార్పొరేటర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలో భవానిపురం ,ఎస్ కే సి వి చిల్డ్రన్స్ ట్రస్ట్ లో ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి పాల్గొని ట్రస్ట్ లోని బాలల మధ్య కేక్ కట్ చేశారు. చిన్నారులకు స్వీట్లు పంచి పెట్టారు.
ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి జన్మదిన వేడుకలు ట్రస్టులోని అనాధ బాలల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
పశ్చిమ లో అవినీతి రహిత పాలన అందిస్తూ ఏపీలోనే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారన్నారు.
మాజీ కార్పొరేటర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ తన పాలనా దక్షతతో, సుజనా ఫౌండేషన్ చొరవతో అభివృద్ధికి ఎమ్మెల్యే సుజనా బాటలు వేస్తున్నారని తెలిపారు .. అనాధ బాలలు ఉన్న ఎస్ కే సి వి చిల్డ్రన్స్ ట్రస్ట్ అభివృద్ధి విషయాన్ని సుజనా చౌదరి దృష్టికి తీసుకెళ్తామన్నారు.
కార్యక్రమంలో కూటమినేతలు జయబాలన్, సందాని, అల్లంకి శ్రీనివాస్, వార్డెన్ జాన్ వెస్లీ, సిడబ్ల్యుఓ ఝాన్సీ రాణి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News