Breaking News

విఎంసి కు సేవలందించి పదవి విరమణ అయిన ఉద్యోగులకు కమిషనర్ ధ్యానచంద్ర ఘన సన్మానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థలో సుదీర్ఘకాలం పాటు వివిధ విభాగాల్లో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఉద్యోగులను విఎంసి కమిషనర్ హెచ్.ఎం. ధ్యానచంద్ర బుధవారం ప్రధాన కార్యాలయం లో గల తమ ఛాంబర్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు శాలువాలు కప్పి, మొక్కలను అందజేసి వారి సేవలను అభినందించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర అభివృద్ధి, ప్రజా సేవల మెరుగుదల మరియు పారిశుద్ధ్య, ఇంజినీరింగ్, నీటి సరఫరా తదితర విభాగాల సమర్థ నిర్వహణలో ఉద్యోగులు అందించిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. తమ విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి సంస్థకు మంచి పేరు తీసుకువచ్చిన ప్రతి ఉద్యోగి విఎంసి కుటుంబంలో విలువైన సభ్యుడని అన్నారు. పదవీ విరమణ అనంతరం కూడా ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితం గడపాలని కమిషనర్ ఆకాంక్షించారు. ఉద్యోగ జీవితంలో సంపాదించిన అనుభవాన్ని సమాజానికి ఉపయోగపడేలా వినియోగించాలని సూచించారు.

మే 31, 2026 నెలలో పదవీ విరమణ పొందిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు జి. సామ్రాజ్యం, ఎస్. ప్రభాకరరావు, శానిటరీ మైస్త్రీ ఎం.ఎం. ఖురేష్, రికార్డ్ అసిస్టెంట్ డి.వై. విశ్వేశ్వరరావు, పీహెచ్ వర్కర్ కె. పేటూరు, మజ్దూర్ పి. రాముడు, హెల్పర్ ఎం. డేనియల్ లను ఈ సందర్భంగా సన్మానించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *